![ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన](/styles/webp/s3/article_images/2024/11/13/12mkl302-210151_mr-1731438385-0.jpg.webp?itok=FM4-vWFY)
ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరసన
కృష్ణా: మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మంగళవారం రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిరసనకు దిగారు. పలువురు రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం దాదాపు 2వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా.. వ్యవసాయ అధికారులు తేమ శాతాన్ని పరిశీలించగా 17శాతం వచ్చిందన్నారు. గన్నీ బ్యాగులు త్వరలో ఇస్తామని చెప్పి తీరా మంగళవారం వచ్చేసరికి మీ ధాన్యంలో తాలు ఉందని వంకలు పెడుతున్నారని ఆరోపించారు. 20 రోజులుగా ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
● అదేవిధంగా మురహర్‌దొడ్డిలోని ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి 20 రోజులు అవుతున్నా తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో తిప్పి పంపుతున్నారని రైతులు ఆరోపించారు. నేటికీ ఒక్క బస్తా ధాన్యం కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment