![మార్మోగిన గోవింద నామస్మరణ](/styles/webp/s3/article_images/2024/11/14/13dvd603-210031_mr-1731552289-0.jpg.webp?itok=2jkV_4lj)
మార్మోగిన గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా విరాజిల్లుతున్న అమ్మాపూర్ కురుమూర్తి స్వామి జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే వివిధ వాహనాల్లో వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. అలివేలు మంగమ్మ, ఆంజనేయస్వామి, చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జాతర మైదానంలో దుకాణ సముదాయాలలో వివిధ వస్తువులను కొనుగోలు చేశారు. గాజుల దుకాణాలు, హోటళ్లు, కిటకిటలాడాయి.
● కురుమూర్తి స్వామి దర్శనానికిభక్తుల బారులు
● ఆలయంలో ప్రత్యేక పూజలు
Comments
Please login to add a commentAdd a comment