![కడుపు](/styles/webp/s3/article_images/2024/11/14/13mbnrl03_mr-1731552292-0.jpg.webp?itok=Q-5eV-Tb)
కడుపులో మంట వస్తోంది..
మా గ్రామానికి ఇథనాల్ కంపెనీ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆరు నెలల నుంచి కంపెనీ నుంచి దుర్వాసనతో కూడిన గాలి వస్తోంది. నాతో పాటు గ్రామంలో చాలా మందికి కడుపులో మంటగా ఉంటోంది. దీంతో వైద్యుడిని సంప్రదిస్తే విష వాయువులను పీల్చడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. ఈ విషయంపై గ్రామస్తులు అందరం ఏకమై కంపెనీని రద్దు చేయాలని తహసీల్దార్‌ను కలిసి విన్నవించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చాం. ఇంత వరకు ఫలితం రాలేదు. కంపెనీని ఎత్తివేసి మా ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
– ఆంజనేయులు, ఫర్ధీపూర్, చిన్నచింతకుంట
మా బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి..
మా గ్రామం గుండా తుంగభద్ర నది పారుతోంది. పొలాలకు నీరు పెట్టుకునే అవకాశం ఉండటంతో పచ్చని పైర్లు పండుతాయి. ఇథనాల్ ఫ్యాక్టరీ పెడితే ఊర్లో ఉన్న పొలాలకు నీరు లేక, ఉన్న నీరు కలుషితమై వ్యవసాయంతో పాటు మా బతుకులు ప్రశ్నార్థకంగా మారుతాయి. ఇలాంటి ఫ్యాక్టరీలు ఉన్న చోట ప్రజలు పడే ఇబ్బందులు చూస్తూనే ఉన్నాం. అందుకే గ్రామంలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దాని నిర్మాణం జరగనివ్వం. – రాజేంద్రప్రసాద్,
రైతు, పెద్ద ధన్వాడ, రాజోళి
పునఃసమీక్షించాలి
ఇథనాల్ కంపెనీ వల్ల చాలా నష్టం. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఫ్యాక్టరీ నిర్మాణం చేసుకోవడానికి అనుమతిస్తారా? పర్మిషన్లు ఇచ్చి ప్రజల్ని బందీలుగా చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇథనాల్ కంపెనీల విషయమై పునఃసమీక్షించాలి. పూర్తిగా రద్దు చేయాలి. లేకపోతే పోరాటం తప్పదు.
– బి.కృష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి, గుడెబల్లూర్
●
![కడుపులో మంట వస్తోంది..
1](/gallery_images/2024/11/14/06_mr-1731552292-1.jpg)
కడుపులో మంట వస్తోంది..
![కడుపులో మంట వస్తోంది..
2](/gallery_images/2024/11/14/07_mr-1731552292-2.jpg)
కడుపులో మంట వస్తోంది..
Comments
Please login to add a commentAdd a comment