
ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం
మద్దూరు: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చే యాలని, యాప్‌లోని అన్ని వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పెదిరిపాడ్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వేలో ఏమైన అనుమానాలు వస్తే ఉన్నతాధికారులను అడిగి తెలసుకోవాలని సూచించారు. అలాగే దరఖాస్తుదారుల నుంచి అన్ని వివరాలను క్షుణ్ణంగా సేకరించాలని ఆదేశించారు. వలస వెళ్లిన వారికి ముందస్తు సమాచారం ఇవ్వడం గానీ, ముందు రోజు టాంటాం వేయించడం చేయాలని సూ చించారు. సర్వర్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రతిరోజు సర్వర్ సమస్య ఉండదని ఉదయం, సాయంత్రం వేళ్లల్లో అప్‌లోడ్ చేయాలని తెలియజేశారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైతే తప్పని సరిగా యాప్‌లో ఎంట్రి చేయాలని సూచించారు. మద్దూరు కొంత మంది మహిళలు ఎన్నో ఏళ్లుగా అద్దెకు ఉంటున్నామని మాకు స్థలాలకు కూడా లేవని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం మీ లాంటి వారికి ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టే ఆలోచనలో ఉందని తెలియజేశారు.
మెనూ ప్రకారం భోజనం అందించాలి
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ వంట ఏజెన్సీ మహిళలకు, కేజీవీబీ ఎస్‌ఓ గౌరమ్మకు అదేశించారు. పెదిరిపాడ్‌లోని కేజీవీబీ పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం మెనూ ప్రకారం బెండకాయ కర్రీ బదులుగా టమాటా కర్రీ చేయడాన్ని కలెక్టర్ తప్పుపట్టారు. వండిన భోజనాన్ని ఇద్దరు ఉపాధ్యాయులు, మెస్ కమిటీ సభ్యులు రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలన్నారు. విద్యార్థులకు వండిన ఆహారాన్ని ఆమె భుజించారు. విద్యార్థుల సమస్య లను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని కష్టపడి చదువాలని విద్యార్థులకు కలెక్టర్ సూచించారు. కేజీవీబీలో ఆర్వో ప్లాంట్ రిపేరు, ట్రాన్స్‌పార్మర్ ఏర్పాటు, బోరు మోటారు నీళ్లను పరిక్ష, వంటి పనులను వెంటనే చేపట్టాలని తహసీల్దార్ మహేష్‌గౌడ్‌కు ఆదేశించారు.
ప్రభుత్వ భవనాల నిర్మాణానికి స్థల పరిశీలన
నారాయణపేట: జిల్లా కేంద్రం శివారులోని పలు ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ బుధవారం పరిశీలించారు. నారాయణపేట కొండారెడ్డి పల్లి చెరువు మార్గంలోని 104 సర్వే నంబర్ లో గల దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేంద్రియ విద్యాలయం నిర్మాణం కోసం పరిశీలించారు. అలాగే సింగారం వద్ద నూతన కలెక్టరేట్ వెనక వైపు గల 31 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ స్థలాన్ని జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం పరిశీలించారు. ఆయా స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ప్రతిపాదనలను సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఆర్డిఓ మొగులప్ప, ఆర్డీవో రామచంద్రనాయక్, అడిషనల్ డిఆర్డిఓ అంజయ్య, తహసిల్దార్ అమరేంద్ర కృష్ణ, రెవిన్యూ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment