ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
నారాయణపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహించొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 15 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్,అదనపు కలెక్టర్ రెవెన్యూ బెంషాలం ట్రైనీ కలెక్టర్ గరిమానరుల పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 9 అర్జీలు..
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 9 అర్జీలు వచ్చాయి. ఎస్పీ యోగేష్ గౌతమ్ నేరుగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలు విన్నారు. భూ తగాదాలకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని, అలాగే పోలీస్ స్టేషన్లకు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లేవారు మధ్యవర్తులను తీసుకువెళ్లరాదని, బాధితులు మాత్రమే ధైర్యంగా వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫిర్యాదుదారులకు తెలిపారు.
శనగలు క్వింటాల్ రూ.5,719
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో సోమవారం శనగలు క్వింటాల్‌కు గరిష్టం, కనిష్టంగా రూ.5,719 ధర పలికాయి. అలాగే, పెసర గరిష్టం, కనిష్టంగా రూ.7 వేలు, వేరుశనగ గరిష్టంగా రూ.5,960, కనిష్టంగా రూ.4,330, జొన్నలు గరిష్టంగా రూ.4,559, కనిష్టంగా రూ.3,406, అలసందలు గరిష్టంగా రూ.7,012, కనిష్టంగా రూ.6,756, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,370, కనిష్టంగా రూ.5,809, తెల్ల కందులు గరిష్టంగా రూ.7,711, కనిష్టంగా రూ.6,829 ధర పలికాయి.
నేటినుంచి కాచిగూడ
డెమో రైలు పునరుద్ధరణ
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్–కాచిగూడ డెమో రైలును మంగళశారం నుంచి పునరుద్ధరించనున్నారు. కుంభమేళా నేపథ్యంలో దాదాపు 45 రోజుల పాటు ఈ రైలును భక్తుల సౌకర్యార్థం అక్కడికి నడిపారు. తిరిగి నేటి నుంచి ప్రతి రోజు ఉదయం 6.45 గంటలకు మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు నడవనుంది. డెమో రైలు తిరిగి పున:ప్రారంభం కానుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment