అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మరికల్/దామరగిద్ద: అర్హులైన లబ్ధిదారులందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మరికల్, దామరగిద్ద మండలాల్లో పైలెట్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేసి, ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పల్లెగడ్డలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. త్వరలోనే రేషన్‌కార్డులను కూడా పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటికే 90 శాతం మందికి ఉచిత కరెంట్, సిలిండర్లు అందుతున్నాయని, పథకాలు అమలు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి అర్హులకు ఆరు గ్యారంటీలను అందజేస్తామని హామీచ్చారు. మీ అభిమానం కూడా కాంగ్రెస్ పార్టీపై ఎప్పటికి ఉండాలని సూచించారు. మరికల్ కార్యక్రమంలో తహసీల్దార్ అనిల్‌కుమార్, ఎంపీడీఓ కొండన్న, ఎంపీఓ పావని, రేవతమ్మ, వీరన్న, సూర్యమోహన్‌రెడ్డి, తిమ్మరెడ్డి, పాల్గొన్నారు.
దామరగిద్దలో 72 మదికి ఇళ్లు మంజూరు
దామరగిద్ద మండలంలోని గత్ప గ్రామంలో అర్హులైన 72 మంది లభ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశామని ఎమ్మెల్యే అన్నారు. విడతల వారీగా అందరికీ లబ్ధి చేకూర్చుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, ఎంపీడీఓ సాయిలక్ష్మి, విండో అద్యక్షుడు ఈదప్ప, మాజీ సర్పంచ్ రాములు హౌసింగ్ డీఈ, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment