సెర్ప్‌లో.. మెప్మా విలీనం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇప్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మెప్మా.. ఇక నుంచి డీఆర్డీఏలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లో విలీనం కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో పాటు ఇటీవల నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడగానే మహబూబ్‌నగర్, నారాయ ణపేట జిల్లాలోని మహబూబ్‌నగర్, భూత్పూ ర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, కోస్గి, మద్దూరు, మక్తల్ మున్సిపాలిటీల్లోని మెప్మా ఉద్యోగులు, సిబ్బందితో పాటు మెప్మా జిల్లా కార్యాలయ ఉద్యోగులు సెర్ప్ పరిధిలోకి వెళ్లనున్నారు.
పట్టణాల్లో సర్వేలకు ఇబ్బందే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, ఇతరత్రా పనులను క్షేత్రస్థాయిలో మెప్మా ఆర్పీలు సీఓలు సర్వే చేస్తుంటారు. మెప్మా ఆర్పీలకు కాలనీల్లో ఉండే వివరాలు తేలికగా తెలిసే అవకాశం ఉంటుందని.. ప్రతి సర్వేకు వారి సేవలను వినియోగించుకున్నారు. ఇక నుంచి వారు ఇతర శాఖ పరిధిలోకి వెళ్తే.. మున్సిపాలిటీ సేవలకు వారు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నిర్ణయంతో ప్రభు త్వం చేపట్టే సర్వే చేయాలంటే మున్సిపల్ యంత్రాంగానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
మర్గదర్శకాలు రాలేదు..
డీఆర్‌డీఏలో మెప్మాను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి దాక మాకు ఎలాంటి మర్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గ దర్శకాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి డీఆర్‌డీఏ, మెప్మాలు వేరువేరుగా విదులు నిర్వహిస్తున్నాయి.
– నర్సిములు, డీఆర్‌డీఏ
ఒకే గొడుగు కిందికి రానున్న మహిళా సంఘాలు
డీఆర్‌డీఏ పరిధిలోకి రిసోర్స్‌పర్సన్లు
ప్రతిపాదనలు రూపొందించిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment