ప్రత్యేక జాగ్రత్తలు అవసరం
ప్రభాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్, కృషి విజ్ఙాన కేంద్రం, పాలెం
కొన్ని రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో వరి నార్లు, మిరపనార్లు తదితర పంటల విషయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలపై నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఙానకేంద్రం కోఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వరి నారు మొదటి దశ నుంచే రైతులు జాగ్రత్తలు పాటించాలి.
నారుమళ్లలో నిలిచిన నీటిని సాయంత్రం వేళల్లో పూర్తిగా తొలగించాలి. ఉదయం పూట మళ్లీ నారుమడిని నీటితో నింపాలి. రాత్రి వేళల్లో నారుమళ్లలో నీరు లేకుండా చూసుకుంటే చలి నుంచి రక్షణ ఉంటుంది.
● మిర్చి నార్లు, ఇతర పంటలు ఏవైనా రసాయనిక ఎరువులను తక్కువ మోతాదులో దశల వారీగా వినియోగించాలి.
– సాక్షి, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment