పరీక్ష కేంద్రాలకు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దు
నారాయణపేట: పరీక్ష కేంద్రాలకు ఎవరు సెల్‌ఫోన్ తీసుకురావద్దని, ఈ అంశాన్ని మరోసారి స్పష్టం చేస్తూ ప్రతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెండ్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతికుమారి ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఎల్‌ఆర్‌ఎస్‌పై కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయని జిల్లాలో సమర్థవంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగవద్దని తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం, శిక్షణ పూర్తయిందని, ప్రశ్న పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని, రేపటి నుంచి ప్రశ్నాపత్రాలు స్ట్రాంగ్‌రూంలో నుంచి పోలీస్ స్టేషన్లకు చేరుతాయన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ఉండాలని, జిరాక్స్ షాపులను మూసివేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసి విద్యార్థులను పూర్తిగా చెక్ చేసి లోపలికి అనుమతించాలని ఎటువంటి కాపీయింగ్‌కు పరీక్ష కేంద్రాల్లో అవకాశం ఉండవద్దన్నారు. పరీక్షా కేంద్రాలకు ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది, విద్యార్థులు ఎవరు సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తీసుకుని రావడానికి వీలు లేదన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, విద్యుత్ సరఫరా ఉండాలని, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టిసి బస్సులు నడపాలన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై నివేదికలు పంపాలి
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రతిరోజు నివేదికలు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై తగు సూచనలు ఇచ్చారు. రూరల్ అర్బన్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న వాటిని పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో రుసుం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని, దరఖాస్తుల ఆమోదించే వాటికి మార్చి 31 వరకు క్రమబద్ధీకరణ చేసుకుంటే చెల్లించాల్సిన రుసుములో 25శాతం మినహాయింపు ఉంటుందన్నారు. ఆగస్టు 26, 2020 వరకు 10 శాతం ప్లాట్లు విక్రయించిన లే ఔట్ లను క్రమబద్ధికరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, సబ్ రిజిస్టర్ ద్వారా నిర్ణయిత నమూనాలో నూతన దరఖాస్తులు సేకరించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం మున్సిపల్ శాఖకు వివరాలు పంపించి క్రమబద్ధీకరణ చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ బెన్ షాలం, ఎస్పీ యోగేష్ గౌతమ్, ఆర్డీఓ రామచందర్, డీపీఓ కృష్ణ, డీఎంహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, డీఈఓ గోవిందరాజులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు నాణ్యమైన విద్యాను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. నారాయణపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సింగార్‌బేష్, భవిత కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన ఏవిధంగా జరగుతుందో పరిశీలించారు. ఫిజియోథెరపీ, హోం బేసిక్ ఏడ్యుకేషన్ సంబంధిత ఐఈఅర్‌పి, ఎంఈఓ లను అడిగి తెలుసుకున్నారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులు వేగవంతం
యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం నారాయణపేట మండలం లింగంపల్లి శివారు సర్వే నెంబర్ 30లో గల 20 ఎకరాలలో నిర్మించ తలపెట్టిన పాఠశాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. సుమారు రూ.200 కోట్లతో నిర్మిస్తున్న భవన నిర్మాణానికి సంబందించిన ఏర్పాట్లు త్వరితగిన మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశించారు.
ఇంటర్ విద్యార్థులతోపాటు అధికారులు నిబంధనలు పాటించాలి
కలెక్టర్ సిక్తా పట్నాయక్
Comments
Please login to add a commentAdd a comment