ఆవిష్కరణలకు గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

ఆవిష్కరణలకు గుర్తింపు

Mar 16 2025 1:40 AM | Updated on Mar 16 2025 1:39 AM

పీయూలో పరిశోధనలపై దృష్టి సారించిన అధ్యాపకులు

ఇప్పటికే కెమిస్ట్రీ విభాగంలో పూర్తిస్థాయి పేటెంట్‌ హక్కులు

డిజైన్‌ విభాగంలో రెండు, యుటిలిటీలో ఒకటి,

పరిశీలనలలో మరొకటి

గుర్తింపు వస్తే పూర్తిస్థాయిలో కొత్త ఆవిష్కరణలకు అవకాశం

పాలమూరు యూనివర్సిటీ అధ్యాపకులు బోధనపైనే కాకుండా.. పరిశోధనలపై సైతం దృష్టిసారించారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న పరిశోధనలతో పలు అంశాల్లో పేటెంట్‌ రైట్స్‌ సైతం సాధించారు. మొత్తం కెమిస్ట్రీ విభాగంలో అధ్యాపకులు పర్యావరణహిత రీ ఏజెంట్లు, ఎలాంటి కెమికల్స్‌ లేకుండా సాధారణ పర్యావరణానికి అనుకూలమైన విధానంలో తయారు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ఓ మైలురాయి. దీనికి పేటెంట్‌ రైట్‌ రావడంతో టీచర్స్‌ అసోసియేట్‌ షిప్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఎక్సలెన్స్‌ ఫెల్లోషిప్‌ అధ్యాపకులు చంద్రకిరణ్‌ ఎంపికయ్యారు. మ్యాథ్స్‌ విభాగంలో అధ్యాపకులు రిమోట్‌ కంట్రోల్‌ ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ తయారీ, రోలర్‌ స్టాంప్‌ తయారీకి డిజైన్‌ విభాగంలో పేటెంట్‌ రాగా.. స్ట్రెచింగ్‌ షీట్‌పై కాసన్‌ నానోఫ్లూయిడ్స్‌ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పంచే పద్ధతి వంటివి ఇటీవలే ఆవిష్కరించారు. ఇవి పరిశీలన దశలో ఉండగా.. మరో ఆవిష్కరణను ఎంబీఏ అధ్యాపకులు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ ప్రిడెక్టర్‌ వంటి పరికరాలు ఆవిష్కరించారు. దీంతో ఇటు అధ్యాపకులు రీసెర్చ్‌ స్కాలర్స్‌, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల అనంతరం ఒక కొత్త యంత్రాల ఆవిష్కరణతో జరిగే ప్రయోజనం వంటి అంశాలపై దృష్టిసారించారు.

– మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌

● రోలర్‌ స్టాంప్‌ పరికరాన్ని మ్యాథ్స్‌ విభాగం అధ్యాపకులు మధు ఆవిష్కరించగా.. పేటెంట్‌ రైట్‌ లభించింది. గణితం అంటే భయపడే పాఠశాల స్థాయి విద్యార్థులకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడనుంది. దీని ద్వారా గణిత ప్రక్రియలను సులభతరం చేసేందుకు అవకాశం ఉంది.

● రసాయన శాస్త్రంలో కెమికల్స్‌ ప్రాసెసింగ్‌, ఏరో స్పేస్‌, బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ పారిశ్రామిక అనువర్తనాల్లో వేడి, ద్రవ్యరాశి బదిలీలో కీలకపాత్ర పోషిస్తున్న స్ట్రెచింగ్‌ షీట్‌పై కానస్‌ నానోఫ్లూయిడ్‌ ప్రవాహంలో వేడి, ద్రవ్యరాశి బదిలీని పెంచే పద్ధతిలో కూడా మ్యాథ్స్‌ విభాగంలో పరిశోధనలు పూర్తి కాగా పేటెంట్‌ రైట్‌ పరిశీలనలో ఉన్నాయి.

ఆవిష్కరణలకు గుర్తింపు 1
1/1

ఆవిష్కరణలకు గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement