మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణ రోజు విడిచి రోజు చేస్తున్నారు. ఒక ట్రాక్టరు ఒక మినీ ఆటో ద్వారా చెత్త సేకరణ చేస్తూ డంపింగ్ యార్డు స్థలానికి చేర్చుతున్నారు. రేణివట్లలో ఒక ట్రాక్టర్ ద్వారా ప్రధాన రహదారి వెంబడి చెత్తను సేకరిస్తూ చెత్తను కాలుస్తున్నారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయడం గగనం అయిపోయింది. మద్దూర్‌లోని ఎస్సీ బాలుర హాస్టల్ దగ్గర రోడ్డుపైనే చెత్తను వేస్తున్నారు. కాపు గేరి, అమరగడ్డ, మీదిగిరి తదితర ప్రాంతాల్లో చెత్త తొలగించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుంది.