సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
నారాయణపేట/కోస్గి రూరల్: నేరాలను నియంత్రించడంతో పాటు, నిందితులను గుర్తించడంలోనూ సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం కోస్గి పోలీస్ సర్కిల్ కార్యాలయంలో కమ్యూనిటీ వైర్‌లెస్ సీసీ కెమెరాలను కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రూ.10 లక్షలతో ఏర్పాటుచేసిన ఈ సీసీకెమెరాలను జిల్లాతోపాటు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశామని, అసాంఘిక కార్యక్రమాలు, నేరాల నియంత్రణతోపాటు శాంతి భద్రతలు కాపాడవచ్చాన్నారు. రోడ్డు ప్రమాదాలు , దోంగతనాలు తదితర సంఘటనలో సీసీ కెమెరాల ద్వారా పట్టుకోవడానికి అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, సిఐ సైదులుతోపాటు రఘువర్దన్‌రెడ్డి, సీసీ కెమెరాల దాత ప్రదీప్ పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్నిస్తాయని, పోలీసులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు క్రీడలు ఆడాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం సాయంత్రం జిల్లా పోలీసులు విరామ సమయంలో క్రీడలు ఆడేందుకు క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్ట్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటుచేయగా..ఎస్పీ ప్రారంభించారు.