బాధితులకు అండగా సైబర్ వారియర్స్
నారాయణపేట: సైబర్ బాధితులకు సైబర్ వారియర్స్ అండగా ఉండాలని సైబర్ క్రైం ఇన్‌చార్జ్ సీఐ గోపాల్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో సైబర్ వారియర్స్‌కు నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న సైబర్ నేరాలు, ప్రజలు మోసపోతున్న తీరు, నమోదైన కేసుల్లో జప్తు చేసిన నగదు, పోగొట్టుకున్న నగదు బాధితులకు తిరిగి అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సైబర్ బాధితులు తమ ఖాతా నుంచి డబ్బులు పోయినట్లు గుర్తించిన వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ 1930, డయల్ 100కి గాని, ఎన్‌సీఆర్‌బీ పోర్టల్‌లోగాని ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ బాధితులకు గోల్డెన్ అవర్ ఉంటుందని.. ఆ సమయంలోగా 1930కి సమాచారం ఇస్తే నగదు బదిలీ కాకుండా చేయడం, బాధితులకు అందించడం జరుగుతుందని చెప్పారు. సైబర్ బాధితులకు డబ్బులు త్వరగా ఇప్పించేందుకు కొత్త పద్ధతిని వారికి తెలియజేశారు. పూర్తి అవగాహనతో కోర్టు ద్వారా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ప్రజలు సైబర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో సైబర్ క్రైం ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్, ఐటీ కోర్ రమేశ్, జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల సైబర్ వారియర్స్, కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment