సారా కట్టడికి కదిలిన ఎకై ్సజ్ అధికారులు
కోస్గి: సారా కట్టడికి ఎకై ్సజ్ అధికారులు నడుం బిగించారు. సోమవారం పలు తండాల్లో దాడులు నిర్వహించారు. జిల్లాలో ఇటీవల సారా విక్రయాలు పెరగడం, యువత మత్తుకు బానిస అవుతుండడంపై ‘మళ్లీ గుడుంబా..’ శీర్షికన శనివారం ‘సాక్షిశ్రీలో కథనం ప్రచురితమవగా ఎకై ్సజ్ శాఖ అధికారులు స్పందించారు. కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని పలు తండాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా తయారీకి వినియోగించే 100 లీటర్ల బెల్లం ఊట పట్టుబడినట్లు ఎకై ్సజ్ సీఐ బాలకృష్ణ తెలిపారు. ఎకై ్సజ్ ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది కుమ్మరికుంట తండా, బీమ్లా తండా, సుభ్యా నాయక్‌తండా, సారంగరావుపల్లి శివారులో సారా స్థావరాలపై దాడులు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం ఊట పట్టుబడగా నలుగురిని అరెస్టు చేసి గుండుమాల్ తహసీల్దార్ భాస్కర్ స్వామి ఎదుట హాజరు పరిచి బైండోవర్ చేశారు. పట్టుబడిన వారిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. ఎక్కడైన సారా తయారు చేసినట్లు గుర్తించిన, సారా అమ్ముతూ పట్టుబడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ పురుషోత్తంరెడ్డితోపాటు సిబ్బంది హరీష్, దయాకర్, కృష్ణ, రవి, విమల తదితరులు పాల్గొన్నారు.
పలు తండాల్లో దాడులు.. 100 లీటర్ల బెల్లం ఊట పట్టివేత
నలుగురి అరెస్టు.. తహసీల్దార్ ఎదుట బైండోవర్
సారా కట్టడికి కదిలిన ఎకై ్సజ్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment