పనిచేసే ప్రదేశంలో వసతుల్లేక నీళ్ల సీసాలు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. ఎండలో పనిచేసే సమయంలో కాస్త ఉపసమనం పొందడం కోసం కనీసం గుడారాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. చెట్ల కిందకు వెళ్లాల్సినా పరిస్థితి ఉంది. పనుల దగర గాయలైతే ప్రాథమిక కిట్లు అందుబాటులో లేవు. – పద్మమ్మ, ఉపాధి కూలి
సామగ్రి ఇవ్వలేదు
కూలీ పనులకు వెళ్తున్న తమకు గత 12 ఏళ్ల నుంచి గడ్డపారలు, పారాలు ఇవ్వలేదు. సొంత డబ్బులు పెట్టి వాటిని కొనుగోలు చేసి పనులకు వెళ్తున్నాం. ఈ విషయాన్ని ఏటా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలకు సామగ్రి అందజేయాలి. – మొగులప్ప, ఉపాధి కూలి
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
పని ప్రదేశాల్లో కూలీలకు ఎండల నుంచి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అవసరమైన వైద్య సామగ్రిని ఆయా మండలాల పరిధిలోని పీహెచ్‌సీలకు నివేదించి తెప్పించుకోవాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. టెంట్లు, గడ్డపారలు ఇతర సామగ్రి ప్రభుత్వం నుంచి రావాల్సింది.
– మొగులప్ప, డీఆర్‌డీఓ
●
ఇంటి నుంచే తాగునీరు..