రూ.12.32 లక్షలకు పేట తైబజార్ వేలం
నారాయణపేట టౌన్: జిల్లా కేంద్రమైన నారాయణపేట మున్సిపాలిటీలో మంగళవారం తైబజార్‌కు బహిరంగ వేలం నిర్వహించారు. 2025–26 సంవత్సరానికి గాను జరిగిన వేలంలో పట్టణానికి చెందిన బండి గణేశ్ రూ. 12.32 లక్షలకు దక్కించుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. అదే విధంగా మాంసం వ్యర్థాల సేకరణకు వేలం నిర్వహించగా.. జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం తిమ్మాపూర్‌కు చెందిన బాలరాముడు రూ. 4.80లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ మల్లికార్జున్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెసర క్వింటాల్ రూ.7,677
నారాయణపేట: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం పెసర క్వింటాల్ గరిష్టంగా రూ. 7,677, కనిష్టంగా రూ. 7,557 ధర పలికింది. వేరుశనగ గరిష్టంగా రూ. 5,810, కనిష్టంగా రూ. 4,420, జొన్నలు గరిష్టంగా రూ. 4,752, కనిష్టంగా రూ. 3,405, అలసందలు గరిష్టంగా రూ. 7,069, కనిష్టంగా రూ. 5,325, ఎర్ర కందులు గరిష్టంగా రూ. 7,211, కనిష్టంగా రూ. 7,166, తెల్ల కందులు గరిష్టంగా రూ. 7,489, కనిష్టంగా రూ. 6,609 ధరలు వచ్చాయి.
వేరుశనగ క్వింటా రూ.6,411
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం వేరుశనగకు క్వింటాల్ గరిష్టంగా రూ.6,411, కనిష్టంగా రూ.5,100 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,792, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,281, కనిష్టంగా రూ.1,791 ,జొన్నలు గరిష్టంగా రూ.4,328, కనిష్టంగా రూ.3,070, ఆముదాలు గరిష్టంగా రూ.6,300, కనిష్టంగా రూ.5,870, మినుములు రూ.7,260 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,205, కనిష్టంగా రూ.1,909గా పలికింది. యాసంగి సీజన్ వరి ధాన్యం కోతకు రావడంతో రైతులు వచ్చిన దిగుబడులను మార్కెట్‌కు తీసుకురావడం ప్రారంభించారు. దాదాపు 300 బస్తాల ధాన్యం అమ్మకానికి వచ్చింది. కాగా.. బుధ వారం ఉదయం 10 గంటల నుంచి ఉల్లిపాయల బహిరంగ వేలం ప్రారంభం అవుతుంది.
నవోదయ ఫలితాలు విడుదల
బిజినేపల్లి: వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 6, 9 తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేసినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఫలితాల కోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
రేపు మెగా జాబ్ మేళా
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌మేళా ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 33 ఏళ్లలోపు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన వారు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పాలెం వెంకన్న హుండీ లెక్కింపు
బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ హుండీని మంగళవారం దేవాదాయ జిల్లా శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వరి ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా హుండీలో రూ.3,17,864 నగదు, 35 గ్రాముల బంగారాన్ని కానుకగా భక్తులు సమర్పించారని ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మనుసాని విష్ణుమూర్తి తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు రామానుజాచార్యులు, అర్చకులు జయంత్, శుక్ల, చక్రపాణి, మాజీ ధర్మకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నేడు అలంపూర్‌లో..
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో బుధవారం హుండీల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ పురేందర్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో ఉన్న హుండీలతో పాటు అన్నదాన సత్రంలోని హుండీని లెక్కించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment