
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
కోస్గి: ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. మండలంలోని చంద్రవంచ గ్రామంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలో మోడల్ విలేజ్‌గా ఎంపికై న చంద్రవంచ గ్రామానికి 193 ఇళ్లు మంజూరయ్యాయని, 70 ఇళ్లు గ్రౌండింగ్ కాగా 6 పునాది స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లకు సంబందించి బిల్లులు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. పునాది స్థాయిలో ఉన్న ఇళ్ల ఫొటోలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయించారు. మిగిలిన లబ్దిదారులు సైతం ఇళ్ళ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ శంకర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి సునిత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డితోపాటు పలువురు లబ్దిదారులు ఉన్నారు.
తాగునీటి సమస్యను పరిష్కరించండి
కోస్గి రూరల్: మున్సిపాలిటీ పరిదిలోని వార్ఢులు, గ్రామాలలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేకంగా కలెక్టర్ రూ.30 లక్షలను మంజూరు చేశారని తెలిపారు. నీటిసమస్య ఉన్న ప్రాంతాల్లో కొత్తగా బోర్లు వేయడం, లేదా మరమ్మతు చేయించడం, పైప్‌లైన్ లీకేజీలను సరిచేయడం, వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సప్‌లై చేయడం వంటివి చేపట్టాలని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చే తగ్గింపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక కార్యచరణ చేపట్టి గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని అదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ నాగరాజు , ఏఈ జ్ఞానేశ్వర్‌రెడ్డి , వర్క్‌ఇన్‌స్పేక్టర్ బాలరాం ఉన్నారు.