
తైబజార్ వేలం.. సిండికేట్
మద్దూరు: మద్దూరు పట్టణంలో ప్రతి గురువారం నిర్వహించే సంతబజారు, పశువుల సంత వేలం శుక్రవారం మద్దూరు శివారులోని రైతు వేదిక వద్ద కొనసాగింది. వేలం పాటదారులు కుమ్మకై మున్సిపాలిటీ అదాయానికి గండి కొట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన వేలం కంటే రూ.2,000 నుంచి రూ. 3,500 అదనంగా పాటపాడి దక్కించుకున్నారు. ఇదంతా రైతు వేదిక పరిసరాల్లోనే జరుగుతున్నా.. అధికారులు మిన్నకుండిపోయారు. వేలం పాటదారులు 22 మంది కుమ్మకై ్క సంతబజారును గుంతల జీడీ వెంకట్‌రాములు రూ.16.28 లక్షలకు, పశువుల సంతను బండి నాగేందర్‌గౌడ్ రూ.20.31 లక్షలకు దక్కించుకున్నారు. దీంతో వేలం పాటలో పాల్గొన్న వారికి దాదాపు 9 వేల నుంచి 10 వేల వరకు గుడ్‌విల్ అందజేసినట్లు సమాచారం. ఈ వేలం నేటి నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రామునాయక్, తదిరులు పాల్గొన్నారు.
సంతబజారును మార్చాలి
ప్రస్తుతం నిర్వహించే సంత బజారు ఇరుకు సందుల్లో కొనసాగుతుండగా.. పాత మద్దూరులోని ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే పాతబస్టాండ్, పాత బ్యాంకు నుంచి ఎలాంటి వాహనాలు వెళ్లేందుకు వీల్లేకుండా సంత బజారు నడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సంతను గతంలో నిర్వహించే స్థలానికి మార్చాలని, సంత బజారులో, పశువుల సంతలో వ్యాపారస్తులకు కొను గోలు దారులకు కనీస వసతులైన మంచినీటి సౌక ర్యం, మూత్రశాలలు, పశువుల సంతలో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు మున్సిపల్ కమిషన్‌కు వినతి పత్రం అందజేశారు..
మున్సిపల్ ఆదాయానికి గండి