
‘యువ వికాసం’ దరఖాస్తుల గడువు పొడిగింపు
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) సంచిత్ గంగ్వర్ తెలిపారు. బుధవారం ఎంపీడీవో, తహసీల్దార్ లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబందిత కార్పొరేషన్ల ద్వారా 100 శాతం నప్సిడీ పై 50 వేల యూనిట్, రూ.లక్ష యూనిట్ 90 శాతం సబ్సిడీతో, రూ.2 లక్షల యూనిట్ 80 శాతం, రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ యూనిట్ లను యువకులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. చిన్న నీటి పారుదల రంగంలో యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి 200 శాతం నబ్సిడీ, ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ పథకం పొందేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్షా 50 వేల లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.2లక్షల లోపు ఉండాలని, తెల్ల రేషన్ కార్డులో దరఖాస్తుదారునిపేరు లేని పక్షంలో మాత్రమే ఆదాయ సర్టిఫికెట్ సమర్పించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. లబ్దిదారులను ఎంపిక చేసిన తర్వాత వారికి మంజూరు పత్రాలు జారీ చేయడంతో పాటు యూనిట్ గ్రౌండింగ్, వ్యాపార నిర్వహణలో పాటించాల్సిన పై శిక్షణ అందిస్తామని, ఆసక్తిగల యువతి, యువకులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. టెలీకాన్ఫెరెన్స్ లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ కలీల్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి ఎంఏ రషీద్, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.
పాపన్నగౌడ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి
బడుగు బలహీనవర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వర్ధంతి నిర్వహించారు. ముందుగా అదనపు కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి మహా యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని, గీత కార్మికుడిగా తన ప్రస్థానంలో భాగంగా అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సలిపిన మహాయోధుడ ని ఆయన కొనియాడారు. ఎటువంటి అండదండలు లేకుండా బడుగు కులాలను ఏకం చేసి భూస్వాములు, మొగలాయిలు, శిస్తుల రూ పంలో పన్నుల వసూళ్ల పేరుతో ప్రజలను పీడి స్తున్న క్రమంలో వారికి అండగా నిలిచి పోరాటం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి అబ్దుల్ ఖలీల్, డిపిఆర్‌ఓ రషీద్, గౌడ సంఘం నాయకులు సతీష్‌గౌడ్ గురునాథ్‌గౌడ్ శ్యాంసుందర్‌గౌడ్, చంద్రశేఖర్‌గౌడ్, శేఖర్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్, శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు.