
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు
● తనిఖీ చేసి.. ఫేక్ మెసేజ్ అని తేల్చినపోలీసులు
నాగర్‌కర్నూల్: జిల్లా కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు మెసేజ్ రావడం కలకలం రేగింది. గురు వారం ఉదయం 7:24 గంటలకు జిల్లా కలెక్టర్ మెయిల్‌కు ఈడీ బేస్డ్ పైప్ బాంబ్‌తో సాయంత్రం 3.20 గంటలకు కలెక్టర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని మెసేజ్ వచ్చింది. ప్రతి రోజు ఉద్యోగులు వచ్చిన వెంటనే కలెక్టర్‌కు వచ్చిన మెయిల్స్ చెక్ చేయడం సర్వసాధారణం. కాగా గురువారం వచ్చిన ఈ బెదిరింపు మెసేజ్‌ను గమనించిన సెక్షన్ ఉద్యోగులు విషయాన్ని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అప్రమత్తమైన ఏఓ ఈ విషయాన్ని ఉదయం 11 గంటలకు ఎస్పీ వైభవ్ గైక్వాడ్, అదనపు ఎస్పీ రామేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాగర్‌కర్నూల్ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్యలు బాంబ్‌స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు, ఆనవాళ్లు లేకపోవడంతో ఫేక్ మెసేజ్‌గా పోలీసులు తేల్చారు. అయితే ముప్పల లక్ష్మణ్‌రావు పేరుతో వచ్చిన ఈ మెసే జ్ చివరి అల్లాహూ అక్బర్ అని రాయడం గమ నార్హం. బాంబు బెదిరింపు రావడంతో ఉద్యోగులు సైతం బయటికి వెళ్లిపోయారు. ఇది ఫేక్ మెసేజ్ అని, మెయిల్ ఐడీ ఐపీ అడ్రస్ కోసం ఐటీ సిబ్బంది ద్వారా విచారణ చేస్తున్నామనిడీఎస్పీ శ్రీనివాసులు వివరించారు.