కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సోమవారం పిడుగులు పడటంతో మూడు జిల్లాల్లో 20 మంది మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. ముర్షిదాబాద్, హుగ్లీ జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించగా, పూర్వ మేడినిపూర్ జిల్లాలో ఇద్దరు మరణించారు. ముర్షిదాబాద్ జిల్లాలో మరో ముగ్గురు గాయపడ్డారని, జంగిపూర్ ఆస్పత్రిలో వీరు చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో రుతుపవనాలు బెంగాల్‌ను తాకనున్న నేపథ్యంలో ఈ మెరుపులు రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment