
ఫైల్ ఫోటో
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఒకే కుటుంబంలోని 32 మంది కరోనా వైరస్ బారిన పడటం కలకలం రేపింది. బండాలో ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని అధికారులు మంగళవారం తెలిపారు. వీరితో పాటు, 44 మందితో కలిసి సోమవారం సాయంత్రానికి జిల్లాలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 807కు చేరిందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ డీ శర్మ ప్రకటించారు.
మరోవైపు కరోనా వైరస్ కారణంగా ఒక జర్నలిస్ట్ నీలన్షు శుక్లా (28) మరణించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే తనకు పాజిటివ్ వచ్చిందని, తనతో సన్నిహితంగా మెలిగిన వారు అప్రమత్తం కావాలని ఆగస్టు 20న ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఇంతలోనే ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపింది. దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 36 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా, 65 వేలమంది చనిపోయారు. యూపీ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,30,414 కు చేరగా, 3,486 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment