సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,809 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,30,237కు చేరింది. తాజాగా వైరస్ బారిపడి 1054 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 80,776కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 79,292 డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారిసంఖ్య 38,59,400గా నమోదైంది. (2058 కేసులు.. 10 మరణాలు)
దేశంలో 78.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. యాక్టివ్ కేసుల శాతం 20.08 శాతం ఉండగా... దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 9,90,061 ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.64 శాతానికి తగ్గింది. ఇక గడచిన 24 గంటలలో దేశంలో 10,72,845 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల నిర్వహించారు. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 5,83,12,273గా నమోదైనట్లు కేంద్రవైద్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment