సిపాయిల తిరుగుబాటు
జనవరి, జూలై, సెప్టెంబరులలో.. కలకత్తా, ముంబై, మద్రాస్ యూనివర్సిటీల సంస్థాపన
తాంతియా తోపే
1857 తిరుగుబాటును బ్రిటిష్ వారు అణిచివేసిన తరువాత కూడా, తాంతియా తోపే అడవులలో గెరిల్లా పోరాట యోధుడిగా ప్రతిఘటనను కొనసాగించాడు. తిరుగుబాటు యోధుడైన తోపే తన దళాలను ఇండోర్ వైపు తీసుకెళ్లినప్పుడు బ్రిటిష్ వారు వెంటపడి అతడిని నిర్బంధించారు. తోపే తనపై మోపిన ఆరోపణలను ఒప్పుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఆయనను ఉరి తీశారు.
చట్టాలు
1. జాయింట్ స్టాక్ కంపెనీస్ యాక్ట్
2. ఓరియెంటల్ గ్యాస్ కంపెనీ యాక్ట్
దేశవిభజన: హతులు 13 లక్షల మంది ::: నిర్వాసితులు కోటిన్నర మంది ::: వలసలు 12.5 లక్షల మంది ::: అత్యాచారానికి గురైన మహిళలు లక్ష మంది
1947 ఆగస్టు 14 వ తేదీ అర్ధరాత్రి మిగతా ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉండగా భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ రాజ్యంగ సభలో నిలిచి మనకు స్వాతంత్య్రం వచ్చిందని ప్రకటించారు. ‘‘చాలా ఏళ్ల క్రితమే మనం ఉజ్వల భవిష్యత్తును స్వప్నించాం. అప్పట్లో చేసుకున్న బాసలను నెరవేర్చుకున్న సమయం వచ్చేసింది’’ అన్నారు. ఎట్టకేలకు స్వాతంత్య్రం వచ్చింది కానీ, దేశం రెండు ముక్కలైంది.
భారతదేశం అంధకార బంధురమైన సుదీర్ఘ పాలన నుంచి విద్వేషాలు పేట్రేగిన, నెత్తురు పారిన ఉదయంలోకి మేల్కొంది! స్వాతంత్య్రం అంటే భారత్ పాకిస్థాన్‌లుగా దేశ విభజన అన్నట్లయింది. ఈ రెండు విముక్త దేశాల మనసులు కూడా చీలిపోయాయి. ఈ చీలిక మానవ చరిత్రలోనే మహోగ్ర విచ్చిత్తి. స్వతంత్ర భారత దేశంలో కూడా ఈ రక్తసిక్త విద్వేషం ఎన్నోమార్లు తీవ్రతలో తేడాలో మళ్లీ మళ్లీ ప్రదర్శితమవుతూనే వస్తోంది.
చదవండి: (శతమానం భారతి.. లక్ష్యం 2047)
Comments
Please login to add a commentAdd a comment