
భారతదేశాన్ని విభజించి పాకిస్థాన్‌ని ఏర్పాటు చేయడానికి ఎం.ఎ.జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని విచ్ఛిన్నం చేయడానికా అన్నట్లు.. మత ప్రాతిపదికన ఒక దేశాన్ని నిలబెట్టలేమని భారత్ చాటి చెప్పగలిగిన సందర్భం భారత్–పాక్ యుద్ధం. బంగ్లాదేశ్ ఏర్పాటుకు చేయూతను ఇస్తూ భారత్ 1971 డిసెంబర్‌లో పాకిస్థాన్ మీద నిర్ణయాత్మక సమరం సాగించి, ఆ పనిని సమర్థంగా పూర్తి చేసింది. ఆ విధంగా పాకిస్థాన్ ఆవిర్భావానికి మూల కారణమైన జిన్నా ద్విజాతి భావనను భారత్ దెబ్బ తీసింది.
పాక్‌తో ఎటూ తేలని 1965 నాటి యుద్ధం, ఆ తర్వాత 1962లో చైనాతో జరిగిన వినాశకర యుద్ధం భారత్ ప్రతిష్టను దెబ్బతీశాయి. అయితే ఈ 1971 నాటి యుద్ధంతో భారత్ తనపై ఉన్న బలహీనమైన దేశం అనే ముద్రను తుడిచేసుకుంది. 1971 యుద్ధం తర్వాత భారత్–పాక్‌ల మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందం దురదృష్టవశాత్తూ కశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తీసుకురాలేకపోయింది. ఇందుకు భారతదేశం ఈనాటికీ మూల్యం చెల్లించవలసి వస్తోంది.
(చదవండి: చైతన్య భారతి: సమ్మిళిత శాస్త్రజ్ఞుడు... జీవశాస్త్ర పితామహుడు)
Comments
Please login to add a commentAdd a comment