పాట్నా: తన ఇంటి సమీపంలో ఆడుకుంటున్న పిల్లలను బెదరగొట్టడానికి బీహార్ మంత్రి కుమారుడు గాల్లోకి కాల్పులు జరపడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. దీనిపై ఆగ్రహించిన స్థానికులు మంత్రి కుమారుడిని చితకబాదారు. ఈ ఘటనల్లో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. బిహార్‌లోని గ్రామంలో భాజపా నేత, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి నారాయణ సాహ్ ఇంటి పక్కనున్న మామిడి తోటలో ఆదివారం కొందరు పిల్లలు చేరి ఆడుకుంటున్నారు. అక్కడ ఆడకూడదని, తక్షణమే వెళ్లిపోవాలని మంత్రి కుమారుడు బబ్లూ కుమార్‌పాటు ఇంటి సిబ్బంది పిల్లలనుహెచ్చరించారు.
ఇందుకు వారు నిరాకరించక ఆటను కొనసాగిస్తుండగా, అక్కడికి మరికొందరు పెద్దలు కూడా చేరారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అక్కడినుంచి వెళ్లిపోయిన బబ్లూ, నాలుగు వాహనాల్లో తన అనుచరులను తీసుకువచ్చి వారిపై దాడికి దిగారు. ఈక్రమంలో తన వద్ద ఉన్న తుపాకీ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. దాడి, కాల్పుల గురించి తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతా కలిసి మంత్రి ఇంటిపైకి దండెత్తారు. మంత్రి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈలోగా బబ్లూ అక్కడి నుంచి పరారయ్యాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
(చదవండి: రసవత్తరంగా యూపీ రాజకీయం.. సరికొత్త వ్యూహాలకు పదును)
Comments
Please login to add a commentAdd a comment