పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో కన్సల్టెంట్‌ పోస్టులు | CFTRI, NPCIL Recruitment 2021: Vacancies, Eligibility, Selection Criteria | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాలో 39 కన్సల్టెంట్‌ పోస్టులు

Published Thu, Jul 22 2021 7:37 PM | Last Updated on Thu, Jul 22 2021 7:43 PM

CFTRI, NPCIL Recruitment 2021: Vacancies, Eligibility, Selection Criteria - Sakshi

పార్లమెంట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సంసద్‌ టెలివిజన్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ ఫైనాన్స్‌ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్‌/ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 39
► పోస్టుల వివరాలు: హెచ్‌ఆర్‌ మేనేజర్, డిజిటల్‌ హెడ్, సీనియర్‌ ప్రొడ్యూసర్, యాంకర్‌/ప్రొడ్యూసర్, అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్, గ్రాఫిక్స్‌ ప్రోమో జీఎఫ్‌ఎక్స్‌ ఆర్టిస్ట్, గ్రాఫిక్స్‌స్కెచ్‌ ఆర్టిస్ట్, ప్రోమో ఎడిటర్, స్విచర్‌ తదితరాలు.
► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు మీడియా నైపుణ్యాలు ఉండాలి.
► వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 35ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.45,000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఈమెయిల్‌: sansadtvadvt@gmail.com
► దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021
► వెబ్‌సైట్‌: https://loksabha.nic.in/


సీఎఫ్‌టీఆర్‌ఐ, మైసూర్‌లో 12 సెక్రటేరియట్‌ అసిస్టెంట్లు
మైసూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సీఎఫ్‌టీఆర్‌ఐ)..సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 12
► పోస్టుల వివరాలు: జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌–09, జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌–03.
► జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌: అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు. వయసు: 28ఏళ్లు మించకూడదు.
► జూనియర్‌ స్టెనోగ్రాఫర్‌: అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి. జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. వయసు: 28ఏళ్లు మించకూడదు.
► ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021
► వెబ్‌సైట్‌: https://www.cftri.res.in


ఎన్‌పీసీఐఎల్‌లో 26 ఇంజనీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌పీసీఐఎల్‌), కైగా సైట్‌(కర్ణాటక)లో.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 26
► పోస్టుల వివరాలు: సివిల్‌–11, మెకానికల్‌–08, ఎలక్ట్రికల్‌–04, సీ అండ్‌ ఐ–ఈసీ–02, సీఅండ్‌ ఐ–సీఎస్‌/ఐఎస్‌–01.
► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ(బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి.
► వయసు: 29.07.2021 నాటికి 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.
► వేతనం: నెలకు రూ.61,400 చెల్లిస్తారు.
► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 29.07.2021
► వెబ్‌సైట్‌: www.npcil.nic.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement