cftri
-
టెస్ట్ మిల్లింగ్‌కు రెండు వంగడాలు
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం వల్ల వచ్చే నూకల శాతాన్ని పరీక్షించేందుకు మైసూర్‌కు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శాస్త్రవేత్తల బృందాలు ఈ నెల 20 నుంచి రంగంలోకి దిగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, యాదాద్రి భువన గిరి, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, వనపర్తి జిల్లాల్లోని 11 మిల్లులను టెస్ట్ మిల్లింగ్ కోసం శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. మొదటి విడతగా మే 27, 28, 29 తేదీల్లో శాస్త్రవేత్తలు మిల్లులను పరి శీలించి, ఎన్నిరకాల వడ్లు పండిస్తారో తెలుసుకుని వాటి నమూనాలను సేకరించిన విషయం తెలిసిం దే. యాసంగిలో రైతాంగం అత్యధికంగా సాగు చేసే వెయ్యిపది (ఎంటీయూ 1010) రకంతోపాటు మ రో స్థానిక వంగడాన్ని తాజాగా టెస్ట్ మిల్లింగ్ కో సం ఎంపిక చేశారు. ఎంపిక చేసిన 11 మిల్లుల్లో ఈ రెండు రకాల ధాన్యాన్ని ఆయా మిల్లుల సామర్థ్యానికన్నా ఐదు రెట్లు అధికంగా అందుబాటులో ఉంచాలని అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నుంచి జూలై ఒకటో తేదీ వరకు టెస్ట్ మిల్లింగ్ ప్రక్రియ సాగనుంది. మొదటి, రెండో విడత పరీక్షల ఫలితాలను బేరీజు వేసుకొని నూక శాతాన్ని ప్రకటించనుంది. ఏయే జిల్లాల్లో ఏ రకం ధాన్యం మిల్లింగ్ చేస్తే ఎంతశాతం నూకలు వస్తున్నాయో పరీక్షించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. తదనుగుణంగా ప్రభుత్వం మిల్లులకు పరిహారం ఇవ్వాలని భావిస్తోంది. బాయిల్డ్ రైస్ వద్దనడంతో వచ్చిన చిక్కు తెలంగాణలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే ఎక్కువగా నూక అవుతుందన్న విషయం తెలిసిందే. సాధారణంగా క్వింటాలు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 67 కిలోల బియ్యం రావాలి. కానీ, యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే కొన్ని జిల్లాల్లో 40 కిలోల బియ్యం కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మిల్లింగ్ చేయడం వల్ల నూక శాతం తగ్గి, ఔటర్న్ రేషియో నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. కానీ, కేంద్రం ఇక నుంచి బాయిల్డ్ రైస్‌ను తీసుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే కష్టనష్టాలను ఓర్చి అయినా యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగానే ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. శాస్త్రవేత్తలు ఎంపిక చేసిన మిల్లే.. మే నెలలో శాస్త్రవేత్తలు వచ్చి జిల్లాలో వివిధ రకాల వడ్ల శాంపిల్స్‌ను సేకరించారు. మిల్లులను సైతం పరిశీలించారు. శాస్త్రవేత్తలే మిల్లులను ఎంపిక చేసుకున్నారు. టెస్ట్ మిల్లింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా నుంచే టెస్ట్ మిల్లింగ్ ప్రారంభం కానుంది. –హరీశ్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, సిద్దిపేట -
పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో కన్సల్టెంట్ పోస్టులు
పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సంసద్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్/ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 39 ► పోస్టుల వివరాలు: హెచ్ఆర్ మేనేజర్, డిజిటల్ హెడ్, సీనియర్ ప్రొడ్యూసర్, యాంకర్/ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్, గ్రాఫిక్స్ ప్రోమో జీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, గ్రాఫిక్స్స్కెచ్ ఆర్టిస్ట్, ప్రోమో ఎడిటర్, స్విచర్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు మీడియా నైపుణ్యాలు ఉండాలి. ► వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 35ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.45,000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: sansadtvadvt@gmail.com ► దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021 ► వెబ్సైట్: https://loksabha.nic.in/ సీఎఫ్టీఆర్ఐ, మైసూర్లో 12 సెక్రటేరియట్ అసిస్టెంట్లు మైసూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎఫ్టీఆర్ఐ)..సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్–09, జూనియర్ స్టెనోగ్రాఫర్–03. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► జూనియర్ స్టెనోగ్రాఫర్: అర్హత: 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021 ► వెబ్సైట్: https://www.cftri.res.in ఎన్‌పీసీఐఎల్‌లో 26 ఇంజనీర్ పోస్టులు భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్), కైగా సైట్(కర్ణాటక)లో.. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 26 ► పోస్టుల వివరాలు: సివిల్–11, మెకానికల్–08, ఎలక్ట్రికల్–04, సీ అండ్ ఐ–ఈసీ–02, సీఅండ్ ఐ–సీఎస్/ఐఎస్–01. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 29.07.2021 నాటికి 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.61,400 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.07.2021 ► వెబ్సైట్: www.npcil.nic.in -
కర్నూలుకు సీఎఫ్టీఆర్ఐ సెంటర్ లేదు
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలులో సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) రిసోర్స్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి శుక్రవారం రాజ్య సభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెబుతూ, కర్నూలులో సీఎఫ్టీఆర్ఐ రిసోర్స్ సెంటర్ నెలకొల్పే ఆలోచన లేదని సీఎస్ఐఆర్-సీఎఫ్టీఆర్ఐ తమకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్ తదితర దేశాలతో పోల్చుకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మన దేశం వెనుకబడిపోవడానికి కారణాలు ఏమిటన్న మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఉత్పత్తి, ప్రాసెసింగ్‌కు మధ్య తగినంత అనుసంధానం లేకపోవడం, ఉత్పత్తి అభివృద్ధి, నవీకరణ లోపించడం, సప్లై చైన్‌లో సంస్థాగతమైన లోపాలు, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. అలాగే అమెరికన్ డాలర్ మారకం విలువలో వస్తున్న మార్పులు, ఎగుమతి చేసే వస్తువుల ధరల్లో మార్పులు, ఎగుమతుల పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆయా సమయంలో విదేశీ మారక ద్రవ్య విలువల్లో సంభవించే మార్పులు ఎగుమతుల విలువపై ప్రభావం చూపుతున్నట్లు మంత్రి చెప్పారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపడుతున్న చర్యల కారణంగా 2016-17లో ఆహోరోత్పత్తుల ఎగుమతుల విలువ 30.87 బిలియన్ డాలర్లు ఉండగా 2017-18 నాటికి అది 35.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. రెండేళ్ళలో విశాఖలో ఎలక్ట్రో మాగ్నటిక్ లేబొరేటరీ విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న ఎలక్ట్రోమాగ్నటిక్ ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ (ఈ3) లేబరేటరీ పూర్తి కావడానికి గడువును మరో రెండేళ్ళపాటు పొడిగించినట్లు ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఎస్.ఎస్. అహ్లూవాలియా తెలిపారు. రాజ్య సభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ, రక్షణ విభాగం, ఎలక్ట్రోమాగ్నటిక్ ఇంటర్ఫియరెన్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ కంపాటబులిటీ, ఎలక్ట్రోమాగ్నటిక్ పల్స్ వంటి కీలక రంగాలలో కన్సల్టెన్సీ సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. -
కర్నూలుకు సీఎఫ్టీఆర్ఐ సెంటర్ లేదు
-
చిరుధాన్యాల సైకిల్ మిల్లు!
ఆరోగ్య సిరులనిచ్చే వివిధ రకాల చిరుధాన్యాలను వర్షాధారంగా సాగు చేసుకునే మెట్టప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులకు ఈ ధాన్యాన్ని బియ్యంగా మార్చుకోవడం పెను సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసే చిన్న రైతులు వాటిని మిల్లుల్లో మరపట్టించడానికి దూరప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొండ ప్రాంత గిరిజన రైతులకు మరీ ఇబ్బంది. లేదంటే పాత పద్ధతుల్లో రెక్కలు ముక్కలు చేసుకుంటూ.. రోట్లో దంచుకొని తినాల్సి వస్తోంది. నిజానికి పండించిన చిరుధాన్యాలను సులభంగా పొట్టు తీసి బియ్యంగా మార్చుకోలేకపోవడం వల్ల చాలా మంది రైతులు వీటిని సాగు చేయడం మానేశారు. అయితే, ఇటీవల కాలంలో పట్టణ, నగరప్రాంత వాసుల్లో కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెల (సిరిధాన్యాల) వాడకం పట్ల అమితాసక్తి రేకెత్తడంతో ప్రస్తుతం చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది రైతులు, రైతు బృందాలు సిరిధాన్యాల సాగుకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఖాదర్‌వలీ సాధారణ మిక్సీని వేగాన్ని తగ్గించేందుకు కాయిల్ మార్చడం, బ్లేడు పదునును తగ్గించడం ద్వారా సిరిధాన్యాలను ఇంటిపట్టునే సులభంగా బియ్యం తయారు చేసుకునే పద్ధతిని సూచిస్తున్నారు. ఇదే కోవలో.. మైసూరులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ(సి.ఎఫ్.టి.ఆర్.ఐ.) సైకిల్ మాదిరిగా తొక్కుతూ చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యం తయారు చేసే చిన్న యంత్ర నమూనాను రూపొందించింది. దీన్ని ‘పెడల్ ఆపరేటెడ్ మిల్లెట్ డీహల్లర్’ అని పిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు విద్యుత్తు అవసరం లేకుండా గ్రామస్థాయిలో ఉపయోగించుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఈ డిజైన్‌ను సి.ఎఫ్.టి.ఆర్.ఐ. వెబ్సైట్ ఫ్రీ టెక్నాలజీస్ విభాగం నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని, ఆయా కొలతల మేరకు ఎవరికి వారు ఈ యంత్రాన్ని తమ ఊరిలోనే తయారు చేయించుకునేందుకు అన్ని వివరాలను పొందుపరిచారు. సైకిల్ మాదిరిగా తొక్కుతుంటే.. చిరుధాన్యాల ధాన్యం పైన ఉండే పొట్టు ఊడిపోయి వండుకు తినడానికి అనువైన బియ్యం వెలికి వస్తాయి. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. మైసూరులో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ బి. వి. సత్యేంద్రరావు ఈ యంత్రాన్ని రూపొందించారు. ‘పెడల్ ఆపరేటెడ్ మిల్లెట్ డీహల్లర్’ ఉపయోగాల గురించి ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి డా. సత్యేంద్రరావు ప్రత్యేకంగా అందించిన వివరాలు.. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో చిరుధాన్యాలను సాగు చేసి, వండుకుతినే చిన్న, సన్నకారు రైతులు తమ ఇంట్లోనే చిరుధాన్యాల బియ్యం అవసరమైనప్పుడు తయారు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం. గ్రామంలో రైతులంతా కలిసి ఒక యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఉపయోగించుకోవచ్చు. మట్టిపెళ్లలు, రాళ్లు, ఇసుక లేకుండా శుభ్రం చేసి ఎండబెట్టిన ధాన్యాన్ని ఉపయోగించాలి. ధాన్యం సరిగ్గా ఎండితేనే తక్కువ మెరికలు వస్తాయి. విద్యుత్తు అవసరం లేదు. సైకిల్ తొక్కినట్టు తొక్కితే చాలు. గంటకు 10–15 కిలోల చిరుధాన్యాల పొట్టు తీసి బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. చిరుధాన్యం రకాన్ని బట్టి, ఎంత వేగంగా తొక్కుతున్నామన్న దాన్ని బట్టి గంటకు ఎన్ని కేజీలు మర ఆడవచ్చన్నది ఆధారపడి ఉంటుంది. ధాన్యం నెమ్మదిగా యంత్రంలోకి వెళ్లేలా చూసుకోవాలి. వేగంగా ధాన్యం లోపలికి పడుతూ ఉంటే యంత్రాన్ని తొక్కే మనిషి మరింత బలంగా తొక్కాల్సి ఉంటుంది. యంత్రాన్ని స్థిరమైన వేగంతో తొక్కితేనే పని సజావుగా సాగుతుంది. యంత్రాన్ని గంట తొక్కితే 13 కిలోల ఊదలు, 11 కిలోలకు పైగా కొర్రలు, 15 కిలోల అరికెలు, 11 కిలోల ఒరిగెలను మర పట్టవచ్చు. పోషకాలు కోల్పోకుండా నాణ్యంగా చిరుధాన్యాల బియ్యాన్ని పొందవచ్చని డా. సత్యేంద్ర వివరించారు. వేగాన్ని బట్టి యంత్రంలోని బ్లోయర్ తిరుగుతుంది. పై నుంచి జారే ధాన్యాన్ని బ్లోయర్ వేగంగా రబ్బర్ రింగ్‌కు తగిలేలా విసురుతుంది. ఆ దెబ్బకు ధాన్యపు గింజ పైపొర ఊడిపోతుంది. బియ్యం, పొట్టు వేర్వేరుగా బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. ఈ యంత్రం నమూనా(ప్రొటోటైప్)ను తయారు చేసి మైసూరులో సందర్శకులకు అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ సి.ఎఫ్.టి.ఆర్.ఐ.లో కూడా నమూనా యంత్రాన్ని ప్రదర్శనకు ఉంచితే రైతులకు మేలు కలుగుతుంది. దీని విడిభాగాల కొలతలు, తయారు చేసే విధానాన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైనా తయారు చేసి రైతులకు అందుబాటులోకి తేవచ్చు. దీని తయారీకి రూ. 17,500 ఖర్చు అవుతుందని, రూ.25 వేలకు విక్రయించవచ్చని సి.ఎఫ్.టి.ఆర్.ఐ. అంచనా. రైతుల ఉత్పత్తిదారుల సంఘాలు పెద్ద ఎత్తున చిరుధాన్యాల బియ్యం ఉత్పత్తి చేయదలచుకుంటే విద్యుత్తు మోటార్లతో నడిచే యంత్రాలు మార్కెట్లో అనేక సంస్థలు అందుబాటులోకి తెచ్చాయని డా. సత్యేంద్ర తెలిపారు. రాళ్లు రప్పలు, మట్టిగడ్డలు తదితరాలను చిరుధాన్యాల నుంచి వేరు చేయడానికి చిన్న, పెద్దస్థాయి యంత్రాలు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నాయని డా. సత్యేంద్రరావు తెలిపారు. సి.ఎఫ్.టి.ఆర్.ఐ. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ విభాగాధిపతి డాక్టర్ సత్యేంద్రరావును 0821–2514534, 099868 46730 ద్వారా సంప్రదించవచ్చు. Email: ttbd@cftri.res.in -
శబరిమల ప్రసాదానికి కొత్త రూపు
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్పస్వామి ఆలయం శబరిమల ప్రసాదంలో భక్తులకు ఇచ్చే అప్పం, అరవణలో మార్పు చేర్పులు చేపట్టనున్నారు. తిరుపతి వెంకన్న, పళనిలోని మురగ ఆలయ ప్రసాదాలైన లడ్డు, పంచామృతాల తయారీలో సూచనలు చేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) శబరిమల ఆలయ ప్రసాదానికీ మెరుగులుదిద్దనుంది. ప్రసాదంగా అందించే అప్పం, అరవణలకు కొత్త రుచి, నాణ్యతలను మేళవించేందుకు ఆలయ యాజమాన్యం ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) సీఎఫ్‌టీఆర్‌ఐతో ఒప్పందం చేసుకుంది. శబరిమల ఆలయానికి ఏటా నవంబర్ నుంచి జనవరి సీజన్లో దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు తరలివస్తారు. మే 15న నెలవారీ పూజ కోసం ఆలయాన్ని తెరుస్తామని..ఆ మరుసటి రోజే ప్రసాదంలో మార్పు చేర్పుల కోసం సీఎఫ్‌టీఆర్‌ఐతో ఆలయ బోర్డు ఎంఓయూ చేసుకుంటుందని టీడీబీ అధ్యక్షుడు ఏ పద్మకుమార్ తెలిపారు. ప్రసాదం తయారీలో నిమగ్నమయ్యే ఆలయ సిబ్బందికి సీఎఫ్ఐఆర్ఐ బృందం శిక్షణ ఇస్తుందని చెప్పారు. అన్నీ సజావుగా సాగితే తదుపరి సీజన్ నుంచే భక్తులకు అప్పం, అరవణ ప్రసాదాలు సరికొత్త రుచులతో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కాగా ప్రసాదాల ధరలను పెంచే ప్రతిపాదన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకూ శబరిమల అప్పం గట్టిగా ఉంటోందని, దాన్ని కొంచెం మెత్తగా, తీయగా రూపొందిస్తామని, ఇక అరవణ గట్టిదనాన్ని తగ్గిస్తామని, ఇందులో ఉపయోగించే బెల్లం పరిమాణం కూడా 30-40 శాతం తగ్గుతుందని చెప్పారు. సీఎఫ్టీఆర్ఐ నిపుణుల పర్యవేక్షణలో ప్రసాదాల తయారీ ఏర్పాట్లు, ప్యాకింగ్ పద్ధతుల్లో మార్పుచేర్పులు చోటుచేసుకుంటాయన్నారు. -
వెయ్యి మందికి ఉచితంగా చియా విత్తనాలు
‘సాక్షి సాగుబడి’ కథనంతో రైతుల నుంచి అనూహ్య స్పందన హైదరాబాద్ సీఎఫ్టీఆర్ఐలో విత్తనాల పంపిణీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, అధిక పోషక విలువలు కలిగిన చియా పంట విత్తనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వెయ్యిమంది రైతులకు అందించనున్నట్లు కేంద్రీయ ఆహార సాంకేతికత పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ– మైసూర్) శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ప్రసన్నాంజనేయరెడ్డి తెలిపారు. సాక్షి ‘సాగుబడి’ పేజీలో ఈ నెల 16న ‘చక్కని లాభాల పంట చియా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన లభించిందని అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని సీఎఫ్టీఆర్ఐ కార్యాలయంలో గురువారం రైతులకు చియా విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే 50 గ్రాముల చియా విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామని, రైతులు సంఘాలుగా ఏర్పడితే మార్కెటింగ్‌కు తోడ్పడతామని చెప్పారు. నూర్పిడి చేసిన చియా గింజలను నేరుగా ఆహారంగా వాడొచ్చని, కినోవా మాదిరిగా పొట్టు తీయాల్సిన పనిలేదని ప్రసన్నాంజనేయరెడ్డి అన్నారు. ఒమోగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నూనె శాతం విషయంలో చాలా మెరుగైనదని వివరించారు. క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆదాయాన్నిస్తుందని చెప్పారు. ఈ పంటకు అడవి జంతువులు, పక్షులు, చీడపీడల బెడద లేదని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చియాకు గిరాకీ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎఫ్టీఆర్ రిసోర్స్ సెంటర్ అధిపతి డాక్టర్ ఆర్.జి.మథ్, సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ టి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. చియా (తెలుపు) విత్తనాలు కావాల్సిన రైతులు 040– 27151157 నంబర్లో తమను సంప్రదించవచ్చని సూచించారు. -
చెన్నై వరద బాధితులకు చేయుత