Engineering career
-
సాఫ్ట్వేర్ కొలువు.. ఇక సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యా విధానంలో సమూల మార్పులకు జేఎన్టీయూహెచ్ శ్రీకారం చుట్టింది. కంప్యూటర్ కోర్సులకు ధీటుగా సాంప్రదాయ బ్రాంచిలకు అదనపు హంగులు అద్దుతోంది. క్రెడిట్స్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ ఉపాధి లభించేలా ఇంజనీరింగ్ కోర్సులకు రూపకల్పన చేసింది. నైపుణ్యంతో కూడిన ఇంజనీరింగ్ విద్య కోసం కొన్నేళ్ళుగా చేస్తున్న కసరత్తు ఈ ఏడాది నుంచే అమల్లోకి వచ్చిందని జేఎన్టీయూహెచ్ ఉప కులపతి ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ఇంజనీరింగ్ విద్యార్థులు ఇక కంప్యూటర్ కోర్సుల వెంటే పడక్కర్లేదని స్పష్టం చేశారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో ఇంజనీరింగ్ చేసినా బహుళజాతి కంపెనీల్లో సులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేజిక్కించుకోవచ్చని చెప్పారు. ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వివరాలు వెల్లడించారు. అమల్లోకి ఆర్–22 ప్రతి నాలుగేళ్ళకోసారి ఇంజనీరింగ్ విద్య స్వరూప స్వభావాన్ని పరిశీలించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య ఎలా ఉండాలనే అంశంపై 250 మంది నిపుణులతో అధ్యయనం చేశాం. ఇందులో పారిశ్రామిక వేత్తలు, సాంకేతిక నిపుణులు, అన్ని సబ్జెక్టులకు చెందిన నిష్ణాతులూ ఉన్నారు. వీరి సలహాల ఆధారంగా రూపొందించిందే ఆర్–22 రెగ్యులేషన్. ఇది యూజీసీ, అఖిలభారత సాంకేతిక విద్య నిబంధనలకు లోబడే ఉంటుంది. ఇక్కడ ఇచ్చే క్రెడిట్స్ ఏ దేశంలోనైనా చెల్లే విధంగా ఇది ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అనుసరిస్తాయి. అన్ని బ్రాంచ్‌లకు అదనంగా కంప్యూటర్ కోర్సులు ఇంజనీరింగ్‌లో సీఎస్సీ ఓ క్రేజ్‌గా మారింది. కానీ ఇప్పుడు దానికోసం అంతగా పోటీ పడాల్సిన పనిలేదు. సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ కోర్సులు చేయవచ్చు. ప్రధాన బ్రాంచినే చదువుతూ.. బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటాసైన్స్ (పైథాన్ లాంగ్వేజ్‌తో), క్లౌడ్ డెవలప్స్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, ఇండ్రస్టియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇండ్రస్టియల్ ప్రొడక్షన్ టెక్నిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఇంటర్నెట్ థింక్స్ వంటి కోర్సులను అదనంగా చేసేందుకు జేఎన్టీయూహెచ్ వీలు కల్పిస్తుంది. ఒక్కో సబ్జెక్టులోనూ మూడు విభాగాలుంటాయి. ఒక్కో విభాగానికి మూడు క్రెడిట్స్ ఉంటాయి. ఈ కోర్సులను 70 శాతం ఆన్లైన్లో, 30 శాతం ప్రత్యక్ష బోధన ద్వారా నేర్చుకోవచ్చు. రోజుకు రెండు గంటల చొప్పున ఆరు నెలల్లో 48 గంటల్లో ఈ కోర్సులు పూర్తి చేసుకోవచ్చు. నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌కు 160 క్రెడిట్స్ వస్తాయి. అదనపు కోర్సులు చేయడం వల్ల మరో 26 క్రెడిట్స్ వస్తాయి. ఏ బ్రాంచి విద్యార్థి అయినా సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందేందుకు ఈ క్రెడిట్స్ సరిపోతాయి. అంతర్జాతీయంగా కూడా ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థుల ఉపాధికి ఢోకా ఉండదు. ఇంతకుముందు ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని చేర్చుకుని తమకు అవసరమైన విధంగా శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడు చాలా సంస్థలు నైపుణ్యం వారినే చేర్చుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేసేసరికే కంప్యూటర్ నాలెడ్జి ఉండటం ఉపకరిస్తుంది. ఎగ్జిట్ విధానం.. డ్యూయల్ డిగ్రీ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తేనే పట్టా చేతికొచ్చే పాత విధానం ఇక ఉండదు. రెండేళ్ళు చదివినా డిప్లొమా ఇంజనీరింగ్‌గా సర్టిఫికెట్ ఇస్తారు. అంటే డిప్లొమాతో భర్తీ చేసే ఉద్యోగాలకు ఇది సరిపోతుందన్నమాట. ఒకవేళ ఇంజనీరింగ్ పూర్తి చేయాలనుకుంటే అంతకు ముందు ఇచి్చన డిప్లొమా సర్టిఫికెట్ సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ మధ్యలో మానేసే వారికి ఒకరకంగా ఇది వరమే. రెండేళ్ళ వరకు క్రెడిట్స్‌ను కూడా లెక్కగడతారు. మరోవైపు డ్యూయల్ డిగ్రీ విధానం కూడా అందుబాటులోకి వచి్చంది. జేఎన్టీయూహెచ్ పరిధిలో బీబీఏ అనలిటికల్‌ను ఆన్లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలి్పస్తున్నాం. ఇంజనీరింగ్ చేస్తూనే దీన్ని చేయవచ్చు. ఇక ఇంజనీరింగ్ మధ్యలోనే స్టార్టప్స్ పెట్టుకునే వాళ్ళు.. వీలైనప్పుడు (8 ఏళ్ళలోపు) మళ్ళీ కాలేజీలో చేరి ఇంజనీరింగ్ పూర్తి చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపు తేవడమే ఈ మార్పుల లక్ష్యం. -
నిరుద్యోగులు ఇక సిద్ధంగా ఉండండి.. ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు!
2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలలో దాదాపు 1.2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఓ ప్రముఖ నివేదిక తెలిపింది. ఈ రంగాలలో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటైజేషన్ వేగం పెరిగిపోవడంతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి భయాలు తగ్గడంతో ఉద్యోగ నియామకాల సంఖ్య పెరుగుతుందని నివేదిక తెలిపింది. టీమ్ లీజ్ డిజిటల్ నివేదిక ప్రకారం.. అధిక నైపుణ్యం & ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి శాతం మొత్తం ఉద్యోగాలలో దాదాపు 17 శాతం ఉండనుంది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాలకు చెందిన 750 మందికి పైగా యజమానులు/నాయకులను సర్వే, ఇంటర్వ్యూ చేసిన టీమ్ లీజ్ 'ప్రొఫెషనల్ స్టాఫింగ్ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్ రిపోర్ట్' పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల ఇండస్ట్రీ విప్లవం అనేది 4.0 దశకు చేరుకున్నది అని కంపెనీ యజమానుల అభిప్రాయం. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరగడం వల్ల మానవ వనరులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు టీమ్ లీజ్ డిజిటల్ హెడ్ సునీల్ అన్నారు. "మొత్తం మీద, ఈ 3 రంగాలు కలిసి సృష్టించే ఉద్యోగ అవకాశాలలో 2527 శాతం పెరుగుదల ఉంటుంది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారి కోసం ప్రస్తుతం ఉన్న డిమాండ్ 45,65,000 నుంచి 2026 నాటికి 90,00,000(అంచనా) కంటే ఎక్కువ ఉంటుంది" అని సునీల్ అన్నారు. కన్జర్వేటివ్ అంచనాల ప్రకారం.. ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ మార్కెట్ పరిమాణంలో దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ రంగాలు మొత్తం కలిసి భారతదేశం మొత్తం శ్రామిక శక్తిలో సుమారు 8.7 శాతం(సుమారు 42 మిలియన్ల మందికి) ఉపాధి కల్పిస్తున్నారు. 2026 నాటికి ఈ సంఖ్య మరో 54 మిలియన్ల మందికి చేరుకుంటుందని అంచనా. కాంట్రాక్ట్ సిబ్బంది వాటా మొత్తం ఉపాధిలో 10 శాతం నుంచి 16 శాతానికి పెరిగింది. ఇది 2026 నాటికి మొత్తం ఉపాధిలో 24 శాతం ఉంటుందని భావిస్తున్నారు. (చదవండి: ఎలన్‌మస్క్ సంచలన నిర్ణయం..! సోషల్ మీడియాపై గురి..!) -
పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో కన్సల్టెంట్ పోస్టులు
పార్లమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన సంసద్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్స్/ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 39 ► పోస్టుల వివరాలు: హెచ్ఆర్ మేనేజర్, డిజిటల్ హెడ్, సీనియర్ ప్రొడ్యూసర్, యాంకర్/ప్రొడ్యూసర్, అసిస్టెంట్ ప్రొడ్యూసర్, గ్రాఫిక్స్ ప్రోమో జీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, గ్రాఫిక్స్స్కెచ్ ఆర్టిస్ట్, ప్రోమో ఎడిటర్, స్విచర్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు మీడియా నైపుణ్యాలు ఉండాలి. ► వయసు: దరఖాస్తు చివరి తేది నాటికి 35ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.45,000 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: sansadtvadvt@gmail.com ► దరఖాస్తులకు చివరి తేది: 28.07.2021 ► వెబ్సైట్: https://loksabha.nic.in/ సీఎఫ్టీఆర్ఐ, మైసూర్లో 12 సెక్రటేరియట్ అసిస్టెంట్లు మైసూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(సీఎఫ్టీఆర్ఐ)..సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 12 ► పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్–09, జూనియర్ స్టెనోగ్రాఫర్–03. ► జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: అర్హత: సంబంధిత విభాగాన్ని అనుసరించి 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► జూనియర్ స్టెనోగ్రాఫర్: అర్హత: 10+2/ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. జీతం: నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు చెల్లిస్తారు. వయసు: 28ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021 ► వెబ్సైట్: https://www.cftri.res.in ఎన్‌పీసీఐఎల్‌లో 26 ఇంజనీర్ పోస్టులు భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్), కైగా సైట్(కర్ణాటక)లో.. ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 26 ► పోస్టుల వివరాలు: సివిల్–11, మెకానికల్–08, ఎలక్ట్రికల్–04, సీ అండ్ ఐ–ఈసీ–02, సీఅండ్ ఐ–సీఎస్/ఐఎస్–01. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ(బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 29.07.2021 నాటికి 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: నెలకు రూ.61,400 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.07.2021 ► వెబ్సైట్: www.npcil.nic.in -
బీటెక్ ఫస్టియర్.. ఇలా చేస్తే నో ఫియర్!
బీటెక్ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టాం.. నాలుగేళ్ల తర్వాత మంచి మార్కులతో పట్టా పొందితే చాలు.. కొలువు ఖాయమనే అభిప్రాయంతో చాలామంది విద్యార్థులు ఉంటారు. వాస్తవానికి కోర్సు పూర్తయ్యాక కోరుకున్న ఉద్యోగం దక్కాలంటే.. మార్కులతోపాటు మరెన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఎందుకంటే.. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే ఆఫర్లు ఇచ్చేందుకు సంస్థలు ముందుకొస్తున్నాయి! ఈ నేపథ్యంలో.. బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. తమ నాలుగేళ్ల స్టడీని ఎలా ప్లాన్ చేసుకోవాలి.. నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తదితర అంశాలపై విశ్లేషణ.. బీటెక్‌లో అకడమిక్‌గా మంచి మార్కులతోనే కొలువుల కల సాకారమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థులు తమ బ్రాంచ్‌కు అనుగుణంగా నూతన టెక్నాలజీలపై పట్టు సాధించాలి. ఇందుకోసం బీటెక్ మొదటి సంవత్సరం నుంచే కృషి చేయాలన్నది నిపుణుల సలహా. డిజిటల్ యుగం ప్రస్తుతం అంతటా డిజిటల్ టెక్నాలజీ రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లోని సంస్థలూ ఆధునిక సాంకేతికతల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. నైపుణ్యాలున్న వారికే నియామకాల్లో పెద్దపీట వేస్తున్నాయి. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. సదరు తాజా నైపుణ్యాలు, టెక్నాలజీలపై పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. బీటెక్ మూడో సంవత్సరంలోకి వచ్చాక నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే సఫలం కాలేరు. ఎందుకంటే.. ఆ సమయంలో ఓవైపు తృతీయ, చివరి సంవత్సరాల అకడమిక్ ఒత్తిడి.. మరోవైపు ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్ట్ వర్క్, ప్లేస్‌మెంట్స్ వంటివి ఉంటాయి. బ్రాంచ్ ఏదైనా బీటెక్‌లో ఏ బ్రాంచ్ విద్యార్థులైనా సరే.. తమ విభాగానికి సరితూగే ఇండస్ట్రీ పరిణామాలను నిత్యం తెలుసుకోవాలి. డిజిటల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవాలి. కోర్ బ్రాంచ్‌లు మొదలు సాఫ్ట్వేర్ కొలువులకు మార్గం వేసే సీఎస్ఈ, ఐటీ విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇండస్ట్రీ 4.0 స్కిల్స్ ► ప్రస్తుతం బీటెక్ విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న నైపుణ్యాలను నేర్చుకోవడం తప్పనిసరిగా మారింది. కారణం.. కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న వారికే ఆఫర్లు ఖరారు చేస్తుండటమే! మొత్తం విద్యార్థుల్లో ఇండస్రీ ్ట4.0 స్కిల్స్ ఉన్న వారి సంఖ్య 20 నుంచి 25 శాతం మధ్యలోనే ఉంటోంది. దీంతో అవకాశాలున్నా.. నైపుణ్యాలు లేక ఎంతోమంది నిరాశకు గురవుతున్నారు. కాబట్టి బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు.. భవిష్యత్ అవకాశాలు అందుకోవాలంటే.. ఇప్పటి నుంచి ఆయా నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. (ఎన్డీఏ, ఎన్ఏ 2021: ఇంటర్‌తోనే.. కొలువు + చదువు) ► ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, 3డి డిజైన్, ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, వీఆర్/ఏఆర్ టెక్నాలజీలు..ఉద్యోగ సాధనలో కీలకంగా మారుతున్నాయి. బీటెక్ విద్యార్థులు తొలి రోజు నుంచే వీటిని నేర్చుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఇంజనీరింగ్‌లో చేరిన లక్ష్యానికి అనుగుణంగా కెరీర్‌ను ఉజ్వలంగా మలచుకునే అవకాశం లభిస్తుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కారణంగా చాలామంది విద్యార్థులు లేటెస్ట్ స్కిల్స్ నేర్చుకోలేకపోతున్నారు. అలాంటి విద్యార్థులు ఆన్లైన్ మార్గాల్లో సొంతంగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. కోడింగ్.. ప్రోగ్రామింగ్ ప్రస్తుతం ఉద్యోగ సాధనంలో కీలకంగా నిలుస్తున్న నైపుణ్యాలు.. కోడింగ్, ప్రోగ్రామింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ కోర్సు స్వరూపంలోనే వీటికి అకడమిక్‌గా ప్రాధాన్యం ఉంది. కాని ప్రాక్టికల్ అప్రోచ్ తక్కువగా ఉండటంతో ఈ నైపుణ్యాలు ఆశించినంతగా లభించట్లేదు. ము ఖ్యంగా సీఎస్ఈ/ఐటీ బ్రాంచ్‌ల విద్యార్థులు కోడింగ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను ప్రాక్టికల్ అప్రోచ్‌తో నేర్చుకునేందుకు సిద్ధమవ్వాలి. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్, పైథాన్, ఆర్, జావా, సీ, సీ++, పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్ డేటాబేస్ వంటివి నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. మూక్స్, ఆన్లైన్ వేదికలు, షార్ట్‌టర్మ్ కోర్సులు, యూట్యూబ్ వీడియోల ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, రెడ్ హ్యా ట్, ఐబీఎం, జెట్ కింగ్ వంటి సంస్థలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌పై సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా సంబంధిత నైపుణ్యాలు పొందొచ్చు. సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు ► ఈసీఈ, ఈఈఈ వంటి సర్క్యూట్ బ్రాంచ్‌ల విద్యార్థులు కూడా లేటెస్ట్ డిజిటల్ స్కిల్స్ సొంతం చేసుకునే దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలి. ► ఈసీఈ విద్యార్థులు వీఎల్ఎస్ఐ, నానో టెక్నాలజీ విభాగాల్లో షార్ట్‌టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు పూర్తి చేయడం ద్వారా జాబ్ మార్కెట్లో ముందుండొచ్చు. వీరికి కలిసొచ్చే మరికొన్ని సర్టిఫికేషన్ కోర్సులు.. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ; ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోటిక్స్. ► ఈఈఈ విద్యార్థులు.. ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, సర్క్యూట్ అనాలిసిస్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ వంటివి నేర్చుకోవాలి. వీటితోపాటు ఎస్సీఏడీఏ (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్), డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటిని ఇప్పుడు పలు మార్గాల్లో నేర్చుకునే అవకాశం ఉంది. రోబోటిక్ స్కిల్స్ మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులు.. రోబోటిక్ స్కిల్స్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాలి. దీంతోపాటు ఈ బ్రాంచ్ విద్యార్థులు క్యాడ్, క్యామ్; ఆటోమేషన్, 2–డి, 3–డి డిజైన్ ప్రింటింగ్లపైనా అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం రోబో ఆధారిత కార్యకలాపాలు అన్ని సంస్థల్లోనూ సాగుతున్నాయి. అన్ని బ్రాంచ్‌ల విద్యార్థులకు రోబోటిక్ స్కిల్ మేలు చేస్తుందని చెప్పొచ్చు. వీటిని సొంతంగా అభ్యసించేందుకు పలు ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రాక్టికల్, అప్లికేషన్ అప్రోచ్ మొదటి సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం వరకు ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఏ అంశాన్నైనా ప్రాక్టికల్ ఓరియెంటేషన్, అప్లికేషన్ అప్రోచ్‌తో అధ్యయనం చేయాలి. అందుకోసం లేబొరేటరీల్లో ఆయా సబ్జెక్ట్ అంశాలకు సంబంధించి ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి. తద్వారా రియల్ టైం నైపుణ్యాలు సొంతమవుతాయి. ఇంటర్న్షిప్స్ బీటెక్ కోర్సులో చేరిన విద్యార్థులు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా రియల్ టైమ్ నైపుణ్యాలు పెంచుకునేందుకు.. కనీసం రెండు లేదా మూడు ఇంటర్న్షిప్స్ చేయాలి. ఈ మేరకు ఏఐసీటీఈ కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. కాబట్టి విద్యార్థులు ఆయా విభాగాల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు పొందేందుకు గల మార్గాలను అన్వేషించాలి. ఇందుకోసం క్యాంపస్‌లోని ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెల్, ఆయా సంస్థల్లో పని చేస్తున్న సీనియర్ల సహకారం తీసుకోవాలి. ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా తాజా పరిస్థితులపై అవగాహన వస్తుంది. ప్రాక్టికల్ నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. ఇంటర్న్‌గా చూపిన ప్రతిభ ఆధారంగా సదరు సంస్థల్లోనే పూర్తిస్థాయి ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. సాఫ్ట్ స్కిల్స్ బీటెక్ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా ప్రాధాన్యమివ్వాలి. ప్రస్తుతం సంస్థల్లో టీం వర్క్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో బృందంలోని సహోద్యోగులతోపాటు వివిధ విభాగాల సీనియర్లతో మాట్లాడాల్సి ఉంటుంది. ఆ క్రమంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, బిహేవియరల్ స్కిల్స్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్, డెసిషన్ మేకింగ్ వంటివి ప్రధాన సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. ఆన్లైన్ సదుపాయాలు విద్యార్థులు ఇండస్ట్రీ 4.0 స్కిల్స్,సాఫ్ట్‌స్కిల్స్ పెంచుకునేందకు ఆన్లైన్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవచ్చు. మూక్స్, ఎన్పీటీఈఎల్,స్వయం వంటి పోర్టల్స్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్ల లెక్చర్స్ వినే అవకాశం లభిస్తుంది. ఇలా..ఒకవైపు అకడమిక్ నాలెడ్జ్, మరోవైపు ఇండస్ట్రీకి అవసరమైన లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకునేలా.. మొదటి ఏడాది నుంచే ముందుకుసాగితే.. బీటెక్ విద్యార్థులు తమ కలల కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బీటెక్ మొదటి సంవత్సరం.. ముఖ్యాంశాలు ► బ్రాంచ్ ఏదైనా ఉద్యోగ సాధనలో కీలకం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్. ► ప్రాక్టికల్ అప్రోచ్,అప్లికేషన్ ఓరియెంటేషన్ ఉంటేనే జాబ్ ఆఫర్స్. ► డిజిటల్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్‌కూ ప్రాధాన్యమిస్తున్న సంస్థలు. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఇప్పుడు ఏ బ్రాంచ్ విద్యార్థులైనా.. లేటెస్ట్ స్కిల్స్ ఉంటేనే ఉన్నత విద్య, ఉద్యోగాల పరంగా మెరుగ్గా రాణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే తమ బ్రాంచ్‌కు సరితూగే టెక్నాలజీస్‌పై అవగాహన పొందేందుకు కృషి చేయాలి. అకడమిక్స్‌లో లెర్నింగ్‌తోపాటు ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. – ప్రొఫెసర్ ఎన్.వి.రమణరావు, డైరెక్టర్, నిట్–వరంగల్. -
Engineering Special: బీటెక్ తర్వాత.. కెరీర్ ఆప్షన్స్
ఇంటర్మీడియెట్(ఎంపీసీ) విద్యార్థుల కలల కోర్సు.. ఇంజనీరింగ్(బీటెక్/బీఈ). నేటి యువత క్రేజీ కెరీర్ ఇది. దేశవ్యాప్తంగా ఏటా లక్షల మంది ఇంజనీరింగ్‌లో చేరుతున్నారు. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యాక ఏం చేయాలి?! అనే ప్రశ్న ఎదురవుతోంది. ఉద్యోగమా.. ఉన్నత విద్యా.. ఏ మార్గం ఎంచుకోవాలి.. వాస్తవానికి బీటెక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల ముందు అనేక ఉన్నత విద్య, ఉద్యోగ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు భవిష్యత్ గురించి ఆందోళన చెందకుండా.. తమ కెరీర్ లక్ష్యాలకు ఏది అనుకూలమో అది ఎంచుకోవడం మేలు అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. బీటెక్ తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం.. బీటెక్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ కోర్ విభాగంలోనే కొనసాగాలనుకుంటే.. ఎంటెక్‌లో చేరొచ్చు. లేదా మేనేజ్మెంట్ వైపు వెళ్లాలనుకుంటే.. ఎంబీఏలో అడుగుపెట్టొచ్చు. ఇటీవల కాలంలో ఎంబీఏను ఎంచుకునే ఇంజనీరింగ్ అభ్యర్థుల సంఖ్య పెరుగుతోంది. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్నారు. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ బీటెక్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాలనుకునే ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్. నిజానికి ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ ద్వారా ఉద్యోగం పొందడం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గంగా చెప్పొచ్చు. ప్రముఖ కంపెనీలు, స్టార్టప్ సంస్థలు.. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఏటా ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహిస్తుంటాయి. ఈ ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో పాల్గొనాలనుకునే విద్యార్థులు అందుకోసం ముందుగానే కసరత్తు ప్రారంభించాలి. రిక్రూటర్లను ఆకట్టుకునేలా రెజ్యూమ్ని రూపొందించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే బీటెక్ మొదటి ఏడాది నుంచే సబ్జెక్ట్‌ల్లో మంచి స్కోరు వచ్చేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌తోపాటు బీటెక్ ప్రాజెక్ట్ వర్క్‌పైనా పట్టు సాధించాలి. కాలేజీలో జరిగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్పంచుకోవడం మేలు చేస్తుంది. ప్లేస్‌మెంట్స్ ప్రక్రియలో విజయం సాధించేందుకు సబ్జెక్టు నైపుణ్యాలతోపాటు, ప్రాక్టికల్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్, కంపెనీలు, మార్కెట్లు, తాజా టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి. ఉన్నత విద్య.. ఎంటెక్/ఎంబీఏ ► ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్వదేశంలో ఎంటెక్ లేదా విదేశాల్లో ఎంఎస్ చేయాలని ప్రణాళికలు వేసుకుంటారు. దేశలోని టాప్ కాలేజీల్లో ఎంటెక్‌లో చేరేందుకు చక్కటి మార్గం.. ‘గేట్’(గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్). బీటెక్ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన, బేసిక్ కాన్సెప్ట్లపై గట్టి పట్టు, ప్రశ్నల ప్రాక్టీస్ ద్వారా గేట్లో మంచి ర్యాంకు సాధించొచ్చు. ► గత కొన్నేళ్లుగా ఇంజనీరింగ్ అభ్యర్థులు మేనేజ్మెంట్ కోర్సులను ఎంచుకుంటున్నారు. బీటెక్+ఎంబీఏ.. గొప్ప కెరీర్ కాంబినేషన్‌గా గుర్తింపు పొందింది. వీరికి కార్పొరేట్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాత ఎంబీఏలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. టాప్ బిజినెస్ స్కూల్స్ ఐఐఎం(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ల్లో పీజీ కోర్సుల్లో చేరాలంటే..క్యాట్(కామన్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. క్యాట్‌తోపాటు మ్యాట్,సీమాట్, ఐసెట్, జీమ్యాట్ వంటి ఎంట్రెన్స్‌ల ద్వారా ఎంబీఏలో చేరేందుకు అవకాశం ఉంది. పీఎస్‌యూల్లో ఉద్యోగం బీటెక్ అభ్యర్థులకు మరో మంచి అవకాశం.. ప్రభుత్వ రంగ సంస్థల్లో(పీఎస్‌యూ) ఉద్యోగం. వీరు గేట్లో టాప్ ర్యాంకు ద్వారా సదరు పీఎస్‌యూలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీహెచ్ఈఎల్, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నాల్కో, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ వంటి వాటిల్లో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగం దక్కించుకోవచ్చు. గేట్ స్కోరుతో సంబంధం లేకుండా.. డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎన్ఎండీసీ, బార్క్, ఇస్రో వంటి ప్రముఖ సంస్థల్లో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్స్, ఈఎస్ఈ పరిపాలన విభాగంలో చేరాలనుకునే బీటెక్ అభ్యర్థులకు చక్కటి మార్గం.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఇందుకోసం యూపీఎస్సీ ఏటా విడుదల చేసే నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. మూడంచెల సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించేందుకు సన్నద్ధమవ్వాలి. ఇది దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటి. అలాగే ఇంజనీరింగ్ అభ్యర్థుల కోసం యూపీఎస్సీ విడుదల చేసే మరో ప్రతిష్టాత్మక నోటిపికేషన్..ఈఎస్ఈ(ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్). దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ ఏ స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే యూపీఎస్సీ విడుదల చేసే మరో ఉన్నత నోటిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు కూడా బీటెక్ అభ్యర్థులు పోటీ పడొచ్చు. దేశ సేవకు ‘డిఫెన్స్’ భారత సైన్యానికి అత్యంత నైపుణ్యం కలిగిన సాంకేతిక విభాగం ఉంది. దీంతో భారత సైన్యంలోని టెక్నికల్ వింగ్స్‌లో ఇంజనీర్లకు అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నికల్ ఎంట్రీ లెవెల్‌తో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరొచ్చు. బీటెక్ తర్వాత యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్), ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్ క్యాట్), షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ), కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ) వంటి వాటి ద్వారా త్రివిధ దళాల్లో చేరొచ్చు. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు(టీజీసీ)కు దరఖాస్తు చేసుకొని.. ఇండియన్ మిలటరీ అకాడమీలో చేరొచ్చు. రక్షణ దళాల్లో ఉద్యోగం అంటే.. అత్యంత గౌరవప్రదమైన కెరీర్స్‌లో ఒకటిగా చెప్పొచ్చు. ఇందులో చేరిన అభ్యర్థులకు మంచి వేతనం, ఉద్యోగ భద్రత, సౌకర్యాలతోపాటు దేశానికి సేవ చేస్తున్నామని సంతృప్తి సైతం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో కొలువు బీటెక్ ఉత్తీర్ణులకు ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగాలకు కొదవలేదు. నైపుణ్యాలుంటే.. ప్రభుత్వ రంగం కంటే ఎన్నో రెట్లు అధిక వేతనాలు కార్పొరేట్ కంపెనీల్లో లభిస్తున్నాయి. బీటెక్ గ్రాడ్యుయేట్లను ఇంజనీర్లుగానే కాకుండా.. పరిశోధకులుగా, కన్సల్టెంట్లుగా, సాఫ్ట్వేర్ డవలపర్లుగా నియమించుకుంటున్నారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ డెవలపర్, సివిల్/ఎలక్ట్రికల్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, ఐటీ కో ఆర్డినేటర్, అప్లికేషన్ డెవలపర్ వంటి జాబ్స్ ఐటీ రంగంలో దక్కించుకోవచ్చు. అలాగే క్వాలిటీ ఇంజనీర్, ప్రాసెస్ ఇంజనీర్, ఇండస్ట్రియల్ మేనేజర్, ప్లాంట్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్ వంటి కొలువులు సైతం తయారీ రంగంలో సొంతం చేసుకోవచ్చు. సీ, సీ++, జావా, ఎస్‌క్యూఎల్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, సాఫ్ట్వేర్ టెస్టింగ్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఐవోటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఎంబెడెడ్ టెక్నాలజీ, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నైపుణ్యాలు పెంచుకుంటే వివిధ విభాగాల్లో కొలువులు లభించే అవకాశం ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇటీవల ఎక్కువ మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని, కొత్త ఆలోచనతో స్టార్టప్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు ప్రారంభించిన పలు స్టార్టప్స్ విజయవంతం కావడం.. ఇంజనీరింగ్ అభ్యర్థులకు ప్రేరణగా నిలుస్తోంది. కాని సొంత వ్యాపారం అనే మార్గంలో అనేక సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించేందుకు ఎంతో ఓపిక, సహనం అవసరం!! -
ఇంజనీరింగ్ విద్యకు కొత్తరూపు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ విద్య స్వరూపం పూర్తిగా మారబోతోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా రూపొందించిన మోడల్ కరిక్యులమ్ అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది ఐదారు కాలేజీలకే పరిమితమైన, సంస్కరణలతో కూడిన రీ ఇంజనీరింగ్ విద్య 2020–21 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రాబోతోంది. పరిశోధన, ఆవిష్కర ణలకు ప్రాధాన్య మిస్తూ, ఉపాధి అవకాశాలు అత్యధికంగా ఉన్న కోర్సులను, అందు కనుగుణంగా మార్పు చేసిన విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జేఎన్టీ యూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ విద్యలో సం స్కరణలను 2020– 21 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తేనున్నాయి. ఇప్పటివరకు కొనసాగుతున్న సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులే కాకుండా మార్కెట్ అవసరాలకనుగుణంగా భవిష్యత్‌లో డిమాండున్న కోర్సులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రానున్నాయి. సామర్థ్య పెంపే లక్ష్యంగా.. విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపు, పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇంజనీరింగ్ విద్యలో సంస్కరణలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా మోడల్కరిక్యులమ్ను తెచ్చింది. పారిశ్రామిక రంగానికి చెందిన 8 మంది ఎక్స్పర్ట్స్, 33 ఐఐటీ ఎక్స్‌పర్ట్స్‌లతో కూడిన 11 కమిటీలు బీటెక్ మోడల్ కరిక్యులమ్‌ను రూపొందించాయి. బీటెక్‌లో క్రెడిట్స్‌ను కూడా 200 నుంచి 160కి తగ్గించాయి. ఇక పారిశ్రామిక రంగానికి చెందిన 12 మంది ఎక్స్పర్ట్స్, జాతీయ విద్యా సంస్థలకు చెందిన 22 మంది నిపుణులతో కూడిన కమిటీ ఎంటెక్‌లోనూ మోడల్ కరిక్యులమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులోనూ క్రెడిట్స్‌ను 68కి తగ్గించింది. పరిశోధన, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ తెచ్చిన ఈ సంస్కరణలను రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యా, పారిశ్రామిక రంగాలకు చెందిన అనుభవజ్ఞులతో కూడిన విద్యా బోధన, విద్యార్థుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ విధానాన్ని ప్రోత్సహించడం, ఇష్టమైన సబ్జెక్టులను చదువుకునేలా సరళీకరణ విధానం విద్యార్థులకు అందుబాటులోకి రాబోతోంది. అంతేకాదు పరీక్ష సంస్కరణలు రాబోతున్నాయి. విద్యార్థుల విశ్లేషణ సామర్థ్యాలను పరీక్షించేలా 18 శాతం, అవగాహన స్థాయిని పరీక్షించేలా 30 శాతం, విద్యార్థులు తాము తెలుసుకున్న విషయాన్ని అప్లై చేసే సామర్థ్యాన్ని పరీక్షించేలా 46 శాతం మార్కుల విధానం అమల్లోకి రానుంది. ప్రోత్సహిస్తున్న ఉన్నత విద్యామండలి విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడే ఈ సంస్కరణల అమలును రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెన్నంటి ప్రోత్సహిస్తోంది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీలకు, అధ్యాపకులకు చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. కొత్త సంస్కరణలు, కొత్త కోర్సులకు సంబంధించిన అనుభవజ్ఞులను, పారిశ్రామిక రంగాల వారిని తీసుకురావడం, ఫ్యాకల్టీకి శిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలను తీసుకుంటామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఇటీవల ప్రకటించారు. ఇప్పటికే సిద్ధం చేసిన కార్యాచరణను అమల్లోకి తేబోతున్నారు. మరోవైపు విద్యా సంస్కరణల్లో భాగంగా విద్యార్థులు ఇండక్షన్ ప్రోగ్రాం, తప్పనిసరిగా వేసవిలో ఇంటర్న్‌షిప్ విధానం అమలుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. కోర్ సబ్జెక్టులతోపాటు భారత రాజ్యాంగం, ఎన్విరాన్మెంట్ సైన్స్, ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ ట్రెడిషనల్ నాలెడ్జ్ వంటి అంశాలను విద్యార్థులు చదువుకునేలా చర్యలు చేపట్టాయి. కచ్చితంగా 3 వారాల ఇండక్షన్ ప్రోగ్రాం.. ఇంజనీరింగ్‌లో చేరే ప్రతి విద్యార్థికి కచ్చితంగా మూడు వారాల ఇండక్షన్ ప్రోగ్రాం అమలు చేసేందుకు యూనివర్సిటీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో విద్యార్థులకు ఫిజికల్ యాక్టివిటీతోపాటు క్రియేటివ్ ఆర్ట్స్, యూనివర్సిల్ హ్యూమన్ వ్యాల్యూస్, లిటరసీ, ఫ్రొఫిషియెన్సీ మాడ్యూల్స్, ప్రముఖులతో ఉపన్యాసాలు, స్థానిక ప్రదేశాలు సందర్శన, తాము చేరిన బ్రాంచీలకు సంబంధించిన విశేషాలు సమగ్రంగా వివరించడం వంటి చర్యలు చేపడతారు. తద్వారా ఆ విద్యార్థి ఆ కోర్సుకు సంబంధించిన అవగాహనతో ముందునుంచే చదువుకునేందుకు వీలు ఏర్పడనుంది. ఇందులో విద్యార్థుల అభిప్రాయాలకు ప్రాధాన్యం, బోధనలో అవసరమైన చర్యలు చేపడతారు. 1,000 గంటల ఇంటర్న్‌షిప్.. నాలుగేళ్ల బీటెక్ కోర్సు విద్యార్థులకు 1,000 గంటల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాంను ఏఐసీటీఈ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి విద్యార్థి దీనిని తప్పసరిగా చేసేలా నిబంధన విధించింది. అందులో విద్యా పారిశ్రామిక సంబంధ ఇంటర్న్‌షిప్‌ను 600–700 గంటల చేయాల్సి ఉంటుంది. అలాగే 300–400 గంటలు సామాజిక సేవా సంబంధ అంశాల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యా సంస్థలు తమ బడ్జెట్లో 1 శాతం కచ్చితంగా కేటాయించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. డిమాండున్న కోర్సులకు ప్రాధాన్యం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సులను ఏఐసీటీఈ గతేడాది అందుబాటులోకి తెచ్చింది. అయితే రాష్ట్రంలోని ఐదారు విద్యా సంస్థలు మినహా మిగతావేవీ వీటిని అమలు చేయలేదు. రానున్న విద్యా సంవత్సరంలో మాత్రం వీటిని కచ్చితంగా అమలుచేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా యూనివర్సిటీలు తమ పరిధిలోకి కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలార్జికల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ వంటి ప్రధాన కోర్సులున్నాయి. వాటిల్లోనే 90 శాతం మంది విద్యార్థులు చేరుతున్నారు. అయితే వాటిల్లోనూ ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంజనీరింగ్ కోర్సుల స్వరూపం మారుతోంది. అందుకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబొటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, డిజైన్, ఏఆర్ అండ్ వీఆర్, త్రీడీ ప్రింటింగ్ వంటి కోర్సులను ఏఐసీటీఈ అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఆ కోర్సులు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో అమల్లోకి రాబోతున్నాయి. -
ఇంజనీరింగ్ తొలి అడుగులో వెలుగులీనాలంటే..!
శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానంగా, ఆపై విజయవంతమైన ఆవిష్కరణగా మలచడంలో ఇంజనీరింగ్ కీలకపాత్ర పోషిస్తుంది. మనిషి దైనందిన జీవితంలో ఉపయోగపడే అనేక వస్తువులు దీని ఔన్నత్యానికి ప్రతీకలే! అలాంటి ఇంజనీరింగ్‌లో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవడం లక్ష్యంగా నిర్దేశించుకున్న ఔత్సాహికులు తొలి అడుగుగా బీటెక్/బీఈ మొదటి సంవత్సరంలోకి ప్రవేశించారు. తాజాగా వీరికి తరగతులు మొదలైన నేపథ్యంలో కొత్త కాలేజీ వాతావరణానికి, కొత్త కోర్సుకు ఎలా అలవాటు పడాలి? భవిష్యత్తు లక్ష్యాలను సాధించాలంటే ఎలాంటి నైపుణ్యాలను అలవరచుకోవాలి? తదితరాలపై స్పెషల్ ఫోకస్.. ప్రస్తుత ‘కార్పొరేట్’ విద్యా వాతావరణంలో ఇంటర్మీడియెట్ అంటే ఉరుకుల పరుగుల జీవితం! తరగతుల్లో పాఠాలు, స్టడీ అవర్లు, వారాంతపు పరీక్షలు, పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు.. ఇలాంటి వాటితో రెండేళ్లపాటు అంతా హడావిడిగా సాగిపోతుంది. ఇలాంటి వాతావరణం నుంచి బయటపడి, ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశించిన విద్యార్థుల ముందు ఓ సరికొత్త ప్రపంచం సాక్షాత్కరిస్తుంది. ‘కష్టపడి చదివాం, కోరుకున్న కాలేజీలో సీటు సంపాదించాం. ఇక సాధించాల్సిందేమీ లేద’నే భావనలో కొందరు ఉంటారు. ఇలాంటి ధోరణిని విడిచి, ఉన్నత కెరీర్ లక్ష్యంగా తొలి రోజు నుంచే శ్రమించాలి. వీలైనంత త్వరగా అలవాటుపడాలి కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టే సరికి వివిధ ప్రాంతాలకు చెందిన, వివిధ రకాల మనస్తత్వాలున్న విద్యార్థులు ఎదురవుతారు. వారందరితో కలిసిపోయి క్యాంపస్ జీవితాన్ని ఉత్సాహంగా ప్రారంభించాలంటే వ్యక్తిగత లేదా లైఫ్ స్కిల్స్‌ను అలవరచుకోవాలి. వీటి కోసం ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. స్వతహాగా ప్రవర్తనా తీరును కొంత మార్చుకుంటే సరిపోతుంది. సానుకూల దృక్పథం, ఎదుటి వారి గొప్పతనాన్ని అభినందించే గుణం, ఒత్తిడిని జయించడం వంటి స్కిల్స్‌ను పెంపొందించుకుంటే కాలేజీ క్యాంపస్ లైఫ్‌లో ఎదురే ఉండదు. తొలి రోజుల్లో వివిధ అంశాలకు సంబంధించి రకరకాల సందేహాలు వస్తాయి. వీటిని నివృత్తి చేసుకునేందుకు వెనకడుగు వేయకూడదు. బిడియం లేకుండా లెక్చరర్లు, సీనియర్లను సంప్రదించాలి. అప్పుడే వీలైనంత త్వరగా కాలేజీ వాతావరణానికి అలవాటుపడగలరు. స్నేహితుల విషయంలో స్నేహితుల విషయంలో జాగ్రత్తగా వ్యహరించాలి. మంచి ప్రవర్తన, వ్యక్తిత్వం, అలవాట్లతోపాటు చదువు పట్ల శ్రద్ధ చూపే విద్యార్థులతో స్నేహం చేయడం ఇద్దరికీ మేలు చేస్తుంది. స్పోర్ట్స్ క్లబ్‌లు, సైన్స్ క్లబ్‌లు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి వాటి గురించి తెలుసుకొని విద్యార్థులు తమకిష్టమైన వాటిలో చేరడం ద్వారా నలుగురిలో త్వరగా ఇమిడిపోగలగటం, లీడర్షిప్, ప్రాబ్లం సాల్వింగ్ వంటి స్కిల్స్ పెంపొందించుకోవచ్చు. తల్లిదండ్రులు ఇచ్చే డబ్బును సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలోనూ, టైం మేనేజ్‌మెంట్‌లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి. కోర్సుపై అవగాహన ఇంజనీరింగ్ కోర్సులో కరిక్యులం భిన్నంగా, లోతుగా ఉంటుంది. అందువల్ల కళాశాలలో అడుగుపెట్టిన తర్వాత రెండు, మూడు వారాలను మాత్రమే తోటి విద్యార్థులు, ఫ్యాకల్టీతో పరిచయాలకు కేటాయించాలి. తర్వాత దృష్టం తా చేరిన కోర్సుపైనే కేంద్రీకరించాలి. తొలుత కరిక్యులం మొత్తాన్ని పరిశీలించాలి. సీనియర్లు, ఫ్యాకల్టీ సహాయంతో అవగాహన పెంపొందించుకోవాలి. దీనివల్ల కోర్సుపై పట్టు సాధించేందుకు మార్గం సుగమమం అవుతుంది. ముఖ్యమైన అంశాలు ఇంటర్మీడియెట్ తరహాలో వ్యక్తిగతంగా నేర్చుకునే పద్ధతి (Individual learning)కి పరిమితం కాకూడదు. గ్రూప్‌గా చదవడాన్ని అలవరచుకోవాలి. దీనివల్ల పరస్పరం జ్ఞానాన్ని పంచుకోవడానికి వీలవుతుంది. తెలియని విషయాలను తెలుసుకునేందుకు అవకాశముంటుంది. రోజూ తరగతులకు హాజరవుతూ, సొంతంగా నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీనికోసం కాన్సెప్టులపై ఫ్యాకల్టీ వివరణలు, రిఫరెన్స్ పుస్తకాలు, ఇంటర్నెట్, గ్రంథాలయంను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. సందేహాలను ఎప్పటికప్పుడు ఫ్యాకల్టీని అడిగి నివృత్తి చేసుకోవాలి. ప్రస్తుతం కంపెనీలు ఎలాంటి బ్యాక్‌లాగ్స్ లేని వారికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు ఏ సెమిస్టర్‌కు సంబంధించిన పరీక్షలను ఆ సంవత్సరంలోనే మొదటి ప్రయత్నంలో పూర్తి చేయాలి. సాధారణంగా ఉదయం థియరీ తరగతులు, మధ్యాహ్నం ల్యాబ్ సెషన్ ఉంటుంది. ఇంజనీరింగ్ అప్లికేషన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్. సంబంధిత ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడంతోపాటు బేసిక్స్‌ను నేర్చుకోవడానికి ప్రాక్టికల్స్ దోహదం చేస్తాయి. అందువల్ల లేబొరేటరీలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. స్వీయ అభ్యసనమే రక్ష రక్ష! ఇంటర్మీడియెట్‌లో సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ఉంటాయి. ప్రశ్న-సమాధానం రూపంలో విద్యార్థులు అధిక మార్కులను సాధించడమే లక్ష్యంగా బోధన జరుగుతుంది. కాలేజీ మెటీరియల్ కూడా అందిస్తారు. ఇలా విద్యార్థులకు కోర్సులో స్పూన్ ఫీడింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్‌లో వాతావరణం దీనికి పూర్తిగా భిన్నం. కోర్సుకు సంబంధించి సిలబస్ మాత్రమే ఉంటుంది. విద్యార్థులు ఫ్యాకల్టీ సూచనల ఆధారంగా ఉపయోగపడే ఏ పుస్తకాన్నయినా అధ్యయనం చేయొచ్చు. తరగతి గదిలో బోధనా సిబ్బంది.. కాన్సెప్టులను వివరిస్తారు. కొన్ని సమస్యలను సాధించడంలో సహకరిస్తారు. వీటి ఆధారంగా ఆయా అంశాల్లో పట్టు సాధించేందుకు ప్రభావవంతమైన స్వీయ అభ్యసన (ట్ఛజ ట్టఠఛీడ) ముఖ్యం. అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవడం ద్వారా ఆయా అంశాల్లో విసృ్తత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవచ్చు. తొలి ఏడాదిలో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్తో పాటు సీ-ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను కూడా పరిచయం చేస్తారు. వీటిలోని అంశాలు ఇంజనీరింగ్‌కు ఎలా ఉపయోగపడతాయి? అనే కోణంలో సబ్జెక్టులు ఉంటాయి. అందువల్ల వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ బ్రాంచ్‌లో అయినా ఇష్టంగా చదివితే ఉజ్వల కెరీర్‌కు ఢోకా ఉండదు. కాలేజీ క్యాంపస్‌లో జరిగే బృంద చర్చలు, బృంద కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవచ్చు. ఎక్స్ట్రా, కో కరిక్యులర్ కార్యక్రమాల్లో పాల్గొనడంతో బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు అవకాశముంటుంది. క్యాంపస్‌లో రకరకాల ఈవెంట్లు, టెక్నికల్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ఆర్గనైజింగ్ స్కిల్స్, జట్టుగా పని చేసే నైపుణ్యం అలవడుతుంది. - వి. ఉమా మహేశ్వర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ. స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు! ఇంటర్మీడియెట్‌తో పోల్చితే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. కొంత స్వేచ్ఛాపూరిత వాతావరణం లభిస్తుంది. దీన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంటర్లో శ్రమించిన మాదిరిగానే ఇంజనీరింగ్‌లోనూ కష్టపడాలి. ఇంజనీరింగ్ మొదటి ఏడాదిలో ఇంటర్లో చదివిన అంశాలకు కొనసాగింపు ఉంటుంది. వీటిని ఆకళింపు చేసుకుంటూ ప్రాథమిక అంశాలపై పట్టు సాధిస్తే సబ్జెక్టుల్లో రాణించడం తేలికవుతుంది. విద్యార్థులు ప్రొఫెషనల్‌గా ఉండాలి. వస్త్రధారణ, నడవడిక, మాటతీరు తదితర అంశాలు కీలకంగా మారుతాయి. సమయపాలన పాటిస్తూ, ఆచార్యులు బోధించే అంశాలను ఆకళింపు చేసుకోవడం చాలా ముఖ్యం. తరగతి గదిలో రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. సందేహాలు ఉంటే తరగతి బోధన ముగిసిన తర్వాత ప్రొఫెసర్లను అడిగి, నివృత్తి చేసుకోవాలి. వీలైనంత అధిక సమయం ల్యాబ్‌లో ఉంటూ, ప్రాక్టికల్స్ చేస్తూ సబ్జెక్టుల్లోని అంశాలకు సంబంధించి ప్రత్యక్ష పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. విలువైన సమయాన్ని వృథా కాకుండా చూడాలి. కబుర్లతో కాలక్షేపం చేయకూడదు. ప్రశాంతంగా ఉండే ఉదయం 4-7 గంటల వరకు చదవడానికి కేటాయించాలి. వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న వారికి కమ్యూనికేషన్, నాయకత్వ లక్షణాలు ప్రధానమైనవి. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, సొంతంగా రాయడం చేస్తూ ఆంగ్లంపై పట్టు సాధించాలి. కళాశాలల్లో ఆన్లైన్ జర్నల్స్, డిజిటల్ పుస్తకాలు, ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రధాన గ్రంథాలయంతో పాటు ప్రతి విభాగాలకు విడివిడిగా గ్రంథాలయాలు ఉంటున్నాయి. వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. - డాక్టర్ వై.రామకృష్ణ, కోఆర్డినేటర్ (స్టూడెంట్ అఫైర్స్), ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నైపుణ్యాలుంటే నెగ్గగలరు! ఉద్యోగావకాశాలు వందలు, వేలల్లో ఉంటే పోటీ మాత్రం లక్షల్లో ఉంటోంది. ఇంతటి తీవ్ర పోటీ వాతావరణంలో కోర్సు పూర్తయిందే తడవు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం పొందాలంటే కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పుకునే వీటిని కాలేజీలో చేరిన మొదటి రోజు నుంచే పుణికిపుచ్చుకునేందుకు ప్రయత్నించాలి. సాఫ్ట్ స్కిల్స్: భావ ప్రసార నైపుణ్యాలు మౌఖికంగా/ లిఖితపూర్వకంగా భావాలను స్పష్టంగా చెప్పగలగటం. క్రియాశీలకంగా వినడం, ప్రతిస్పందించటం. తార్కిక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు క్లిష్ట పరిస్థితుల్లో సమస్యలను గుర్తించడం, అర్థం చేసుకోవడం. సమస్యను విశ్లేషించడం, పరిష్కారాలు కనుగొనటం. బృందంగా పనిచేసే నైపుణ్యం ఐటీ కంపెనీల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే వారికి అవసరమైన ముఖ్యమైన నైపుణ్యం. బృంద సభ్యుల వైఖరి(Attitude), ప్రవర్తన, విశ్వసనీయతను గుర్తించడం, గౌరవించడం. బృందంగా విధులను సమర్థంగా నిర్వహించడం. నిరంతర అభ్యసనం,సమాచార నిర్వహణ నైపుణ్యాలు వివిధ వనరుల నుంచి అవసరమైన సమాచారాన్ని గ్రహించగల నైపుణ్యం. సమాచారాన్ని సమర్థంగా ఉపయోగించుకోవడం. వ్యవస్థాపక నైపుణ్యాలు (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ఉపాధి అవకాశాలను గుర్తించడం, వ్యవస్థాపక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం. నైతిక, వృత్తిపర విలువలు ఆర్థిక సంక్షోభం, సామాజిక-సాంస్కృతిక అంశాలను వృత్తిపరంగా అర్థం చేసుకోగల నైపుణ్యం. నైతికతకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం. బృందానికి నేతృత్వం వహించే నైపుణ్యం ప్రాజెక్టును చేపట్టే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ............................................................... యాక్సెంచర్, డెల్, గూగుల్, హెచ్‌పీ, ఐబీఎం తదితర ప్రముఖ సంస్థలు.. తమ వద్ద చేరింది మొదలు సమర్థవంతంగా పనిచేసే (ఐఛీఠట్టటడ ఖ్ఛ్చఛీడ) వారికోసం అన్వేషిస్తున్నాయి. అందువల్ల ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్‌స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. అప్పుడే క్యాంపస్ నియామకాల్లో విజయం సాధించగలరు. ............................................................... సహకారం: -వేదుల నరసింహం, ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్.