
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సతీమణి, సామ్నా దినపత్రిక సంపాదకురాలు రష్మీ ఠాక్రేకు కరోనా సోకింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె ముంబైలోని ప్రభుత్వ అధికార నివాసమైన వర్షా బంగ్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. రెండు రోజుల కిందట రష్మీ ఠాక్రేకు జలుబు చేసింది. దీంతో పరీక్షలు చేయించుకున్నారు.
అందులో ఆమెకు కరోనా సోకినట్లు నివేదిక రావడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం రష్మీ ఠాక్రే ఆరోగ్యం నిలకడగానే ఉందని, మందులు వాడుతున్నారని వైద్యులు తెలిపారు. ఇటీవలే పర్యావరణ శాఖ మంత్రి, ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రేకు కూడా కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులందరు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
చదవండి: (రాజకీయాలకు రాంరాం: దీప)
Comments
Please login to add a commentAdd a comment