
మహారాష్ట్ర: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతవ్(46) ఆదివారం కన్నుమూశారు. ఆయన ఏప్రిల్ 22న కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో ఆయన పుణెలోని జహంగీర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా చికిత్స పొందుతుండగా ఆరోగ్యం విషమించి ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన 1974 సెప్టెంబర్ 21న పుణెలో జన్మించారు. కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ సతవ్ పలు కీలక పదవులు నిర్వర్తించారు. సతవ్ 2014-2019 మధ్య హింగోలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చదవండి: దేశంలో మూడో రోజూ తగ్గిన కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment