
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది. మహారాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నాటికి మహమ్మారి బాధితుల సంఖ్య 13.50 లక్షలు దాటగా ముంబైలో ఆ సంఖ్య రెండు లక్షలు దాటింది. నిన్న ఒక్కరోజే 2,005 కరోనా కేసులు నమోదు కావడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరోనా బాధితుల సంఖ్య 2,00,901కు చేరిందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ముంబైలో గత 24 గంటల్లో కరోనాతో 40 మంది మరణించగా సోమవారం నాటికి మృతుల సంఖ్య 8,834కు చేరింది. (చదవండి: కరోనాతో ఎంసెట్ రాయలేకపోయిన వారికి మరో ఛాన్స్)
అయితే కోలుకునేవారి సంఖ్య కూడా గణనీయంగా ఉండటం కొంత ఊరటనిస్తోంది. ముంబైలో ఇప్పటి వరకు 1,64,882 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. దీంతో ప్రస్తుతం ముంబైలో 26,784 యాక్టీవ్ కేసులున్నాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 13,51,153 మందికి కరోనా సోకగా 10,29,947 మంది కరోనా నుంచి విముక్తి పొందగలిగారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్‌తో 35,751 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,65,033 కరోనా యాక్టీవ్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment