
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే పాజిటివ్ కేసులతోపాటు డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య కూడా పెరగడం ఊరటనిచ్చే విషషం. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 64,553 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 24,61,191కు చేరింది. ఇక దేశంలో నమోదవుతున్న మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఒక్కరోజే అత్యధికంగా 1007 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు మొత్తం 48,040 మంది ప్రాణాలు కోల్పోయారు. (‘రష్యా టీకా అడ్వాన్స్ స్టేజ్‌లో లేదు’)
గురువారం తాజాగా 55,573 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం భారత్‌లో 6,61,595 యాక్టివ్ కేసులు ఉండగా.. 17,51,556 మంది కోలుకున్నారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్న 8,48,728 టెస్టులు చేయగా ఇప్పటి వరకు 2,76,94,416 కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. (కరోనా: తెలంగాణ హెల్త్ బులెటిన్)
Comments
Please login to add a commentAdd a comment