సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రోజూ 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతుండగా.. తాజాగా ఆ సంఖ్య పడిపోయింది. ఆదివారం 3,66,161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, సోమవారం మరింతగా కేసులు తగ్గాయి. దేశవ్యాప్తంగా సోమవారం జరిపిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 3,29,942 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక నిన్న ఒక్కరోజే కోవిడ్ బాధితుల్లో 3876 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,49,992 కు చేరింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,26,62,575 చేరుకోగా..1,90,27,304 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 37,15,221 యాక్టివ్ కేసులున్నాయి. కాగా మహరాష్ట్ర, రాజస్థాన్,గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో ఈ ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
తెలంగాణలో కరోనా కేసులు
ఇక తెలంగాణ లో గడిచిన 24గంటల్లో 4,826 మందికి కరోనా సోకగా 32 మంది మృతి చెందారు. 7,754 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5,02,187 చేరుకోగా 2,739మంది మరణించారు.
(చదవండి: డబుల్ మాస్క్‌పై కీలక మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం)
Comments
Please login to add a commentAdd a comment