
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆల్ఫా, డెల్టా, గామా, బీటా లాంటి వేరియంట్లన్నింటిపై కోవిషీల్డ్, కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తాయని కేంద్రం ప్రకటించింది. డెల్టా ప్లస్ వేరియంట్‌పై టీకాల పనితీరుపై పరిశోధనలు జరుగుతున్నాయంది. ఆల్ఫా తదితర వేరియంట్లపై ఫైజర్, మోదెర్నా టీకాలతో పోలిస్తే కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల ద్వారా వచ్చిన యాంటీబాడీ స్పందన తరుగుదల తక్కువగా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ చెప్పారు.
డెల్టాప్లస్ వేరియంట్ ప్రస్తుతం 12 దేశాల్లో ఉందని, భారత్‌లో 10 రాష్ట్రాల్లో 48 కేసులు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై టీకాల ప్రభావాన్ని పరిశోధిస్తున్నామని, వారం పది రోజుల్లో వివరాలు తెలుస్తాయని చెప్పారు. ఫిబ్రవరిలో మహారాష్ట్రలో సంభవించిన మరణాల్లో 80 శాతం దీనివల్లనే అన్నారు
Comments
Please login to add a commentAdd a comment