చిన్నకన్ను
టీ.నగర్: కారైకుడి సమీపంలో మృతి చెందాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. శివగంగై జిల్లా కారైకుడి సమీపంలో గల కల్లుపట్టికి చెందిన చిన్నకన్ను(46) పదేళ్ల కిందట భార్యను వదిలేశాడు. పాతసామాన్లు అమ్ముకుని జీవనం సాగించేవాడు. కరోనాతో ఉపాధి కోల్పోవడంతో 10 నెలల క్రితం ఇళ్లు విడిచి వెళ్లాడు. నాలుగు రోజుల క్రితం కులికర్తి సమీపాన అటవీ ప్రాంతంలో ఒక మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడ విచారించగా స్థానికులు చిన్నకన్నులా ఉన్నట్లు తెలిపారు.
దీంతో వారి బంధువులు, సోదరి మృతదేహాన్ని చూసి అనుమానం వ్యక్తం చేశారు. శివగంగై ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకోవాల్సిందిగా సూచించారు. చిన్నకన్ను మృతిచెందిన సమాచారం అందడంతో అతన్ని విడిచి వెళ్లిన భార్య వలర్మతి, బంధువులు కల్లుపట్టికి చేరుకున్నారు. మృతదేహాన్ని తీసుకునేందుకు శివగంగై వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అక్కడున్న బంధువు ఒకరు దేవకోటైలో రెండురోజుల క్రితం చిన్నకన్నును చూసినట్లు తెలిపాడు. బంధువులంతా దేవకోటైలో ఉండగా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment