Delhi Excise Policy Case: ED Raids 30 Locations Across India - Sakshi
Sakshi News home page

Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల ఈడీ మెరుపు దాడులు

Published Tue, Sep 6 2022 10:24 AM | Last Updated on Tue, Sep 6 2022 11:02 AM

Delhi Liquor Scam: ED searches 30 Locations In Delhi Mumbai Hyderabad - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మంగళవారం సోదాలు చేపట్టింది. ఏకకాలంలో 30 చోట్ల ఈడీ మెరుపు దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీ, లక్నో, గురుగావ్‌, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లోనూ ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్‌లో ఆరుచోట్ల ఈడీ తనిఖీలు చేపట్టింది.

వ్యాపారవేత్త రామచంద్రన్‌పిళ్లైతో సహా మరో అయిదుగురికి సంబంధించిన కంపెనీలపై ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. రాబిన్‌ డిస్టిలర్స్‌ పేరుతో రామచంద్రన్‌ పిళ్లై వ్యాపారం నిర్వహిస్తున్నారు.బెంగళూరుతోపాటు హైదరాబాద్‌లో వ్యాపార కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. రామచంద్రన్‌కు చెందిన ప్రధాన కార్యాలయంతోపాటు ఇంట్లోనూ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.
చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్‌లో టోల్‌ట్యాక్స్‌ రద్దు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement