Today Surya Grahan Time In Telugu: నేడే సూర్య‌గ్ర‌హణం... ఈజీగా ఇలా చూడొచ్చు! - Sakshi
Sakshi News home page

నేడే సూర్య‌గ్ర‌హణం... ఈజీగా ఇలా చూడొచ్చు!

Published Thu, Jun 10 2021 12:53 PM | Last Updated on Thu, Jun 10 2021 2:35 PM

Details About Surya Grahan Timing And Unknown Facts - Sakshi

ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం గురువారం (జూన్ 10) సంభ‌వించ‌నుంది. ఈ సంద‌ర్భంగా  అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సూర్య గ్రహణం గురించి ప్ర‌క‌టన చేసింది. కాగా భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు గ్రహణం సంభవిస్తుంది. ఆ గ్ర‌హ‌ణాన్ని సూర్య గ్ర‌హణం అని పిలుస్తాం. ఆ స‌మ‌యంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. దీంతో గ్ర‌హ‌ణం నిప్పులు చెరుగుతూ అగ్నివ‌ల‌యంలా క‌నిపిస్తోంది. ఇలా క‌నిపించ‌డాన్ని ‘రింగ్ ఆఫ్ ఫైర్’  అని అంటారు.  

అయితే నేటి సూర్య‌గ్ర‌హణం భార‌త్‌లోని లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లో మాత్ర‌మే పూర్తిగా క‌నిపించ‌నుందని నాసా తెలిపింది. మిగిలిన ప్రాంతాల ప్ర‌జ‌ల పాక్షిక గ్రహణాన్ని మాత్ర‌మే వీక్షించ‌వ‌చ్చు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యాస్తమయానికి కొద్ది నిమిషాల ముందు ఈ సంఘటన క‌ళ్ల ముందు ఆవిష్కృతం అవుతుంద‌ని వెస్ట్ బెంగాల్ ఐకానిక్ బుద్దిస్ట్ స్తూపం ఎంపి బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్  డాక్టర్ డెబిప్రసాద్ డుయారి అన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:42 గంటలకు  ప్రారంభం కావాల్సి ఉంది. సాయంత్రం 6:41 గంటలకు ముగుస్తుంది. గరిష్ట సమయం సాయంత్రం 4:16 గంటలకు ప్రారంభం కానుంది. వృషభం గుర్తులో సరిగ్గా 25 డిగ్రీల వద్ద సూర్యుడు మరియు చంద్రుడు కలుస్తాడ‌ని డుయారి చెప్పారు. చ‌ద‌వండి: ‘గురు’ ఉపగ్రహం ఇలా ఉన్నాడు

సూర్య‌గ్ర‌హ‌ణం ఎలా చూడాలి?
ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షించకూడదు. గ్రహణ సమయంలో భూమిపై చేరే కిరణాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఆ స‌మ‌యంలో మ‌నం గ్ర‌హ‌ణాన్ని చూసిన‌ప్పుడు అవి మన కళ్లకు హాని చేస్తాయి.  కాబట్టి బైనాక్యూలర్లు లేదా టెలిస్కోప్ సహాయంతో వీక్షించాలి. ఇక ఆన్ లైన్ లో టైమండ్‌డేట్.కామ్‌లో మీరు గ్ర‌హ‌ణాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించ‌వ‌చ్చు.  నాసా సైతం ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారాన్ని అందుబాటులో ఉంచింది. దీంతో పాటు ఆస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ కెనడా సడ్‌బరీ సెంటర్ యొక్క లూక్ బోలార్డ్  gov / live. యూట్యూబ్‌లో వీక్షించ‌వ‌చ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement