
జైపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా (89) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పహాడియా 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బిహార్, హర్యానా గవర్నర్‌గా సేవలందించారు. జగన్నాథ్ పహాడియా మృతిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచీ నాకు చాలా అనుబంధం ఉందని, పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి మృతికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కేబినెట్ సమావేశమై సంతాపం తెలుపనుంది. అధికారిక లాంఛనాలతో నేడు పహాడియా అంత్యక్రియలు జరుగనున్నాయి.
(చదవండి:బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్)
Comments
Please login to add a commentAdd a comment