'18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,000' | In Gujarat, Arvind Kejriwal Monthly Allowance For Women Promise | Sakshi
Sakshi News home page

'18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,000'

Published Thu, Aug 11 2022 8:57 AM | Last Updated on Thu, Aug 11 2022 9:03 AM

In Gujarat, Arvind Kejriwal Monthly Allowance For Women Promise - Sakshi

అహ్మదాబాద్‌: రాబోయే గుజరాత్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ రాష్ట్ర మహిళలకు కొత్త హామీనిచ్చారు. ఆప్‌ను అధికార పీఠంపై కూర్చోబెడితే 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌లో బుధవారం వందలాది మంది మహిళల సమక్షంలో ఆయన ఈ హామీనిచ్చారు. ‘ రూ.1,000 అనేది ఉచిత తాయిలం కానేకాదు. ఇది మీ హక్కు. ప్రజల సొమ్ము తిరిగి ప్రజల చెంతకే చేరాలి’ అంటూ కేజ్రీవాల్‌ ప్రసంగించారు.

చదవండి: (Video Viral: జెండా కొంటేనే రేషన్‌.. తీ​వ్ర విమర్శలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement