
చెన్నై : తమిళనాడులోని వానంబడిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. డీఎంకే నేత వేలాయిదంపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వేలాయిదంకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ దాడికి పాల్పడ్డ నిందితులు ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment