
చండీగఢ్: రైతుల ఆందోళనలతో దేశం అట్టుడుకుతున్న తరుణంలో హర్యానా వ్యవసాయ మంత్రి జేపీ దలాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రాణాలు విడిచిన రైతుల పట్ల ఆయన నోరు జారారు. ఒక టీవీ ఇంటర్యూలో రిపోర్టర్... ‘గత ఆరు నెలల్లో నిరసనల్లో పాల్గొన్న దాదాపు 200 మంది రైతులు మరణించారు. దీనిపై ‘మీ స్పందనేంటి’ అని ప్రశ్నించగా దలాల్ వ్యంగ్యంగా స్పందించారు. రైతులు ఇళ్లల్లో ఉన్నా చనిపోయేవారు.. వారందరూ గుండెపోటు, వేరే అనారోగ్యకారణాలతో చనిపోయారని చెప్పుకొచ్చారు.
దాంతో మంత్రి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చుకున్న సదరు మంత్రి.. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణలు కొరుతున్నానని అన్నారు. కాగా, కాంగ్రెస్ లీడర్ రణదీప్ సింగ్ సుజ్రేవాల ఈ వాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ కుమారి సెల్జా దలాల్ వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ లీడర్ రాజ్‌కుమార్ వెర్కా దలాల్‌ను కెబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment