ముంబై: రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా.. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరుగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసింది. అయితే, భారీ వర్షాలతో ముంబైలో జనజీవనం అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీలోను వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఇప్పటికే 7 గురు మృతి చెందారు. భారీ వర్షలకు వేర్వేరు ప్రాంతాల్లో అనేక భవనాలు కూలీపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment