న్యూఢిల్లీ: భారత్‌లో మహమ్మారి రెండో దశ తీవ్రంగా విరుచుకుపడుతోంది. కేసులు, మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 3,82,315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం 3,780 మంది కోవిడ్‌తో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఇక మొత్తం కేసుల సంఖ్య 2,06,65,148కు పెరిగింది. మరణాల సంఖ్య 2,26,188కు చేరింది. ప్రస్తుతం 34,87,229 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం రోజు 15,41,299 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకు 29,48,52,078 టెస్టులు పూర్తి చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ పేర్కొంది. ఇప్పటి వరకు 16,04,94,188 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
మరోవైపు తెలంగాణలో కొత్తగా 6,631 కరోనా కేసులు వెలుగుచూడగా.. 51 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,69,722కు చేరుకుంది. ఇప్పటివరకు 2,572 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 77,704 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో మంగళవారం 1,225 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం 3,89,491 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment