న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ రెండో దశ అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు కోట్లను దాటేసింది. గడిచిన 24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 3,449 మంది మృత్యువాత పడ్డాయి. సోమవారం 3,20,289 మంది కోలుకున్నారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,02,82,833గా ఉంది. ఇప్పటివరకు 2,22,408 మంది మృతి చెందగా 1,66,13,292 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం 34,47,133 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 15.89 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. రికవరీ రేటు 81.9 శాతంగా ఉంది. మరణాల శాతం 1.1గా ఉంది.
ఇక తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు నమోదయ్యాయి. 59 మరణాలు సంభవించాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో సోమవారం 1,029 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,631కు పెరిగింది. ఇప్పటివరకు 3,81,365 మంది డిశ్చార్జ్ అవ్వగా, 2,476 మంది మృతి చెందారు. ప్రస్తుతం 79,520 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment