సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 48,512 తాజా కేసులు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. మొత్తం కేసుల సంఖ్య 15,31,669కి ఎగబాకింది. మహమ్మారి బారినపడి ఒక్కరోజులో 768 మంది మరణించారు. దీంతో దేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 34,193 దాటింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,09,447 యాక్టివ్ కేసులుండగా, మహమ్మారి నుంచి కోలుకుని 9,88,030 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. భారత్‌లో కోవిడ్-19 రికవరీ రేటు 64 శాతంగా ఉందని తెలిపింది. ఇక ఈనెల 28 వరకూ దేశవ్యాప్తంగా 1,77,43,740 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 4,08,0855 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. చదవండి : కరోనా: రెండున్నర నెలల్లో ఇదే అత్యధికం
Comments
Please login to add a commentAdd a comment