కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ | Jharkhand Roads Builts Smoother Than Kangana Ranauts Cheeks | Sakshi
Sakshi News home page

కంగనా రనౌత్ చెంపల కంటే సున్నితమైన రోడ్లు నిర్మిస్తాం!: ఇర్ఫాన్ అన్సారీ

Published Sat, Jan 15 2022 1:35 PM | Last Updated on Sat, Jan 15 2022 1:39 PM

Jharkhand Roads Builts Smoother Than Kangana Ranauts Cheeks - Sakshi

కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ జార్ఖండ్‌లోని తన నియోజకవర్గం జమ్తారాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్ చెంపల కంటే రోడ్లు సాఫీగా ఉంటాయని హామీ ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక సెల్ఫీ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. పైగా ఆ వీడియోలో సినీ నటి కంగనా రనౌత్ చెంపల కంటే రోడ్లు సున్నితంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వారం ప్రారంభంలోనే కరోనా ఉధృతి సమయంలో మాస్క్‌లు ఎక్కువ సేపు ధరించకూడదని, హానికరం అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి.

ఆ వివాదం సద్దుమణిగిపోక మునుపే తాజాగా మళ్లీ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు. అయితే రాజకీయనాయకులు తమకు ఇష్టమైన నటీమణులతో రహదారులను పోల్చడం కొత్తేమి కాదు. 2005లో, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, నటి హేమమాలిని చెంపలలాగా బీహార్ రోడ్లను సున్నితంగా చేస్తానని వాగ్దానం చేసినప్పుడు పెద్ద దుమారం రేగింది. అంతేకాదు గత నెల మహారాష్ట్ర మంత్రి సీనియర్ శివసేన నాయకుడు గులాబ్రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లను హేమా మాలిని చెంపలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో క్షమాపణలు చెప్పవలసి వచ్చిన సంగతి తెలిసిందే.

(చదవండి: బీజేపీకి మరో ఎమ్మెల్యే గుడ్‌బై.. రోజుల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఔట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement