ముంబై: ముంబై, మహారాష్ట్రలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన నటి కంగనా రనౌత్ ముందుగా క్షమాపణ చెపితే, తాను క్షమాపణ చెప్పే విషయం ఆలోచిస్తానని శివసేనకు చెందిన ఎంపీ సంజయ్ రావత్ అన్నారు. ఇటీవల కంగనా రనౌత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో ముంబైని పోలుస్తూ చేసిన వ్యాఖ్యానాలతో అధికార శివసేన నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అహ్మదాబాద్‌ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చగల ధైర్యం కంగనా రనౌత్‌కు ఉందా అని రావత్ ప్రశ్నించారు. కంగనా ట్వీట్‌పై ఆయన మీడియాతో ‘‘ఎవరైనా ఇక్కడ నివసిస్తూ, ఇక్కడ పనిచేస్తూ, ముంబై, మహారాష్ట్ర, మరాఠా ప్రజల గురించి చెడుగా మాట్లాడితే, అటువంటి వారే మొదట క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను క్షమాపణ చెప్పే విషయాన్ని ఆలోచిస్తాను’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment