
సాక్షి, బెంగళూరు: పోలీసు శాఖలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వు పోలీసు ఎస్సై పోస్టులకు స్త్రీ, పురుష అభ్యర్థులతోపాటు ట్రాన్స్‌జెండర్లు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. సుమారు డెబ్భై పోస్టుల భర్తీకి కర్ణాటక స్టేట్ పోలీస్ రిక్రూట్‌మెంట్–2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు పట్టభద్రులై ఉండి, జిల్లా మెజిస్ట్రేట్ నుంచి తమ జెండర్ స్టేటస్‌ను నిర్థారించే సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
చదవండి: Mamata Banerjee: కోల్‌కతా దీదీదే.. తృణమూల్ ‘హ్యాట్రిక్’
Comments
Please login to add a commentAdd a comment