జనాన్ని కొడతారా? రూ.50 వేలు కట్టండి  | Human Rights Commission Have Fined The Bangalore Police | Sakshi
Sakshi News home page

జనాన్ని కొడతారా? రూ.50 వేలు కట్టండి 

Published Fri, Nov 22 2019 8:42 AM | Last Updated on Fri, Nov 22 2019 8:42 AM

Human Rights Commission Have Fined The Bangalore Police - Sakshi

సాక్షి, బనశంకరి: తండ్రి, కుమారుడిని చితకబాదిన బెంగళూరు పోలీసులకు మానవహక్కుల కమిషన్‌  రూ.50 వేల జరిమానా విధించింది. వివరాలు.. ఇటీవల బాణసవాడిలో గ్యాస్‌ స్టౌ మరమ్మత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్న తండ్రీ, కుమారున్ని బాణసవాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. తనిఖీలు చేస్తున్న సమయంలో వారి వద్దనున్న ద్విచక్ర వాహనాల రికార్డులు అందించాలని ఎస్‌ఐ మురళి, హెడ్‌కానిస్టేబుల్‌ లోకేశ్‌ అడిగారు. ఒక వాహనం పత్రాలు అందించి, మరో వాహనం పత్రాలు అందించడానికి నిరాకరించారు. దీంతో పోలీసులు తండ్రీ, కుమారుడిని పోలీస్‌స్టేషన్‌లోకి తీసుకెళ్లి ఇష్టానుసారం చితకబాదారు. దీంతో బాధితులు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు మానవహక్కుల కమిషన్‌ ముందు వివరణ ఇస్తూ తండ్రీ, కుమారుడు తమ విధులకు అడ్డుపడటంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ పోలీసుల వాదనను తోసిపుచ్చిన  మానవహక్కుల కమిషన్‌ చట్టప్రకారం చర్యలు తీసుకోవడం వదిలిపెట్టి ఇలా ఇష్టానుసారం కొడతారా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది. శిక్షగా పోలీసులకు రూ.50 వేల జరిమానా విధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement